Black Friday: బ్లాక్‌ ఫ్రైడే రోజున బంపర్ ఆఫర్స్.. ఇది ఎలా స్టార్ట్ అయ్యిందంటే..!!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-29 06:33:48.0  )
Black Friday: బ్లాక్‌ ఫ్రైడే రోజున బంపర్ ఆఫర్స్.. ఇది ఎలా స్టార్ట్ అయ్యిందంటే..!!
X

దిశ, ఫీచర్స్: బ్లాక్ ఫ్రైడే అనేది షాపింగ్ సీజన్ ప్రారంభాన్ని గురించి తెలియజేస్తుంది. నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ రోజున భారీగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఇది విదేశాలలో బాగా పాపులర్ అయిన ట్రెండ్. ఇప్పుడు ఇది భారతదేశంలో కూడా మొదలైంది. థ్యాంక్స్ గివింగ్ తరువాత వచ్చే, శుక్రవారం రోజు నాడు ఈ బ్లాక్‌ ఫ్రైడే వస్తుంది. బ్లాక్ ఫ్రైడే అనేది భారీ డిస్కౌంట్స్, ఇతర అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ షాపింగ్ సంప్రదాయం. అసలు బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? దీనిని ఎందుకు సెలబ్రేట్ చేస్తారో ఇప్పడు తెలుసుకుందాం.

ఎలా మొదలైందంటే..

నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా ఇతర దేశాల ప్రజలు జరుపుకుంటారు. బ్లాక్ ఫ్రైడే అనే పదం ఫిలడెల్పియాలో 1960లో పుట్టింది. అమెరికాలోని థ్యాంక్స్ గివింగ్ మరుసటి రోజున చాలామంది కార్మికులకు సెలవు దినంగా మారింది. దీంతో షాపింగ్ చేయడానికి వారికి సమయం లభించేది. ఈ అవకాశాన్ని అక్కడి ప్రధాన రిటైల్‌దారులు వినియోగించుకున్నారు. ప్రజలకు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులను భారీ తగ్గింపు ధరలకు ఇవ్వడం ప్రారంభించారు. అలా ప్రతీ సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ తరవాత ఈ భారీ సేల్‌ మొదలైంది. 1990 నుంచి ఈ రోజుకి అతిపెద్ద షాపింగ్ డే‌గా మారింది. అప్పటి నుండి థ్యాంక్స్ గివింగ్ తరువాత వచ్చే శుక్రవారం రోజున భారీ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో సంప్రదాయంగా దీనిని పాటించడం మొదలు పెట్టారు. క్రమంగా ఇది యూకే, కెనడా, భారతదేశం వంటి ఇతర దేశాలలో కూడా ప్రారంభమైంది.

రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ని మొదలు పెట్టింది. ఇది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతీసారి ఇచ్చే ఆఫర్లు కాకుండా వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగించే ఆఫర్లను ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిని ఆఫర్ ధరలతో రిలయన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

అదేవిధంగా ట్రెండ్స్ స్టోర్ కూడా ఈ బ్లాక్ ఫ్రైడేని నిర్వహిస్తుంది. ఇందులో ఆధునిక డిజైన్లు, ట్రెండ్‌కు అనుగుణంగా ఉండే రకరకాల ఉత్పత్తులను ఆకర్షనీయమైన ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ట్రెండ్స్‌లో ట్రెండీ డ్రస్‌లు, షూ, వింటర్ కలెక్షన్లను, ఉమెన్స్, మెన్స్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటుగా ప్రత్యేక ఫ్యాషన్ యాక్ససరీస్‌ను కూడా ప్రత్యేక ఆఫర్లకు అందిస్తోంది. భారతదేశంలో దాదాపుగా అన్నీ ప్రధాన నగరాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Next Story