- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లవ్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నారా?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించిన అమ్మాయికి లేదా అబ్బాయికి తమ ప్రేమను వ్యక్తపరిచే హక్కు మనకు ఎంతుందో.. నచ్చకపోతే రిజెక్ట్ చేసే హక్కు వారికీ అంతే ఉంది. అయితే రిజెక్షన్(Love Rejection)లను కొందరు లైట్ తీసుకొని ముందుకు వెళ్తుండగా.. మరికొందరు అమ్మాయి ఒప్పుకునే వరకు వేధించి.. వెంటాడి మరీ బలవంతం చేస్తుంటారు. ఎంత ప్రయత్నించినా ఒప్పుకోకపోతే క్రూరంగా బిహేవ్ చేస్తుంటారు. యాసిడ్‌తో దాడులు చేయడాలు, కత్తులతో అటాక్ చేయడాలు, మాట్లాడుకుందామని పిలిచి హత్య చేయడాలు వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారంతా క్షణికావేశంతో జీవితాలను రిస్క్‌లో పెడుతున్నారు. అలాంటి వారికి.. ప్రేమికుల దినోత్సవం వేళ హాస్యబ్రహ్మా, గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న తెలుగు నటుడు బ్రహ్మానందం(Brahmanandam) కీలక సూచనలు చేశారు. ఇటీవల ఆయన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘లవ్ అనేది చాలా గొప్ప విషయం.. అది అందరికీ దక్కదు. దక్కిన వారికి సరిగా ఉపయోగించుకోవడం రాదు.. ఉపయోగించుకోవడం తెలిసిన వారికి అది దక్కదు. ఒకవేళ మన ప్రేమను ఎవరైనా రిజెక్ట్ చేస్తే ద్వేషం పెంచుకోవద్దు. మృగంలా బిహేవ్ చేయొద్దు. వారి నిర్ణయాలను గౌరవించాలి. వారిని ఆరాదించాలి’’ అని సూచించారు. ‘‘ఎందుకంటే సమాజంలో ప్రేమగా నడుచుకుంటేనే.. మనకూ ప్రేమ తిరిగి వస్తుంది.. అందుకే ప్రేమను బతికించాలి. ప్రేమను పెంచాలి. ప్రేమను పంచాలి.. ప్రేమను ఆస్వాదించాలి.. అది తండ్రి కొడుకుల మధ్య అయినా, తల్లి కూతురు మధ్య అయినా.. అన్నా చెల్లెల మధ్య అయినా.. బావా బామ్మర్ది మధ్య అయినా.. ప్రేమికుల మధ్య అయినా’’ అని బ్రహ్మానందం అడ్వైస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన నెటిజన్లు ‘థాంక్యూ మీమ్ గాడ్’ అని కామెంట్లు పెడుతున్నారు.