మహిళలకు బిగ్ అలర్ట్.. ఈ హ్యాబిట్స్ ఉంటే పిల్లలు పుట్టే చాన్స్ చాలా తక్కువట..

by Kavitha |
మహిళలకు బిగ్ అలర్ట్.. ఈ హ్యాబిట్స్ ఉంటే పిల్లలు పుట్టే చాన్స్ చాలా తక్కువట..
X

దిశ, వెబ్‌డెస్క: వర్క్ స్ట్రెస్, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం ఇలా అనేక కారణాల వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుత కాలంలో మెయిన్‌గా ఉన్న సమస్యల్లో వంధ్యత్వ (Infertility) సమస్య ఒకటి. దీనివల్ల చాలా కుటుంబాలు పిల్లల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. మరి అసలు ఆ సమస్యకు గల కారణాలు, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు మనం చూద్దాం..

వంధ్యత్వం అంటే ఏమిటి..

ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ మహిళ గర్భం దాల్చక పోతే, దానిని వంధ్యత్వంగా పరిగణిస్తారు. ఇక WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. భారతదేశంలో వంధ్యత్వ రేటు 3.9 నుంచి 16.8 శాతం వరకు ఉంది.

ఇప్పుడు ఈ సమస్య చిన్న వయసులో కూడా మహిళల్లో కనిపిస్తోంది. నేటి కాలంలో జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, వైద్య పరిస్థితుల కారణంగా వంధ్యత్వ కేసులు పెరుగుతున్నాయి. అలాగే PCOS, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, ఊబకాయం వంటి పరిస్థితులు కూడా వంధ్యత్వానికి కారణమవుతాయి. ఇప్పుడు స్త్రీలలోనే కాదు పురుషులలో కూడా వంధ్యత్వం పెరుగుతోంది. పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గడం, అంగస్తంభన సమస్య వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

వంధ్యత్వానికి ఎలా చికిత్స చేస్తారు..?

ఒక జంట వంధ్యత్వంతో ఉంటే.. మొదట మందులు ఇచ్చి, ఆ తర్వాత సహజ పద్ధతుల ద్వారా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తారట. ఇది సాధ్యం కాకపోతే, గర్భాశయ గర్భధారణ జరుగుతుందట. దీని ద్వారా కూడా గర్భం దాల్చక పోతే ఐవీఎఫ్. ఆశ్రయిస్తారట. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్, సరోగసీ ద్వారా గర్భం ధరించవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్‌లో, మహిళల గుడ్లు వారి యవ్వనంలోనే స్తంభింపజేయబడతాయి. తరువాత, వారు గర్భం ధరించాలని నిర్ణయించుకున్నప్పుడు, గుడ్లను డీఫ్రోజన్ చేసి IVFలో ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా IVF ట్రెండ్ బాగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఇది గర్భం ధరించడంలో కూడా సహాయపడుతుంది.

వంధ్యత్వాన్ని ఎలా నివారించాలి..

మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి

ధూమపానం చేయవద్దు – మద్యం సేవించవద్దు

గర్భనిరోధక మందులు తీసుకోవడం మానుకోండి

మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోండి

నిద్రపోయే మరియు మేల్కొనే సమయాన్ని సెట్ చేయండి

ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయండి

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story

Most Viewed