- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG అలర్ట్: నిల్చొని వాటర్ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది మంచినీళ్లు నిలబడి తాగేస్తుంటారు. అయితే, అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. నిలబడి వాటర్ తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు. ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం అవ్వొచ్చు. అలాగే కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎసిడిటీ సమస్యను ఎదుర్కొవాల్సి రావచ్చు. అల్సర్, గుండెల్లో మంట, అజీర్ణ సమస్యలు, దాహం వేసినప్పుడు నిలబడి వాటర్ తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని తాజాగా అధ్యయనంలో తేలిందని నిపుణులు వెల్లడించారు.
నీరు తాగే సమయంలో ప్రవాహ వేగం అధికంగా ఉంటే దాని ప్రభావం లంగ్స్‌కు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది నీటిని వంగి తాగడం లేదా పడుకొని తాగడం వంటివి చేస్తారు. ఈ విధంగా చేయడం శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా నీరు తాగేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచి నెమ్మదిగా నీరు తాగాలి. కొంతమంది వేగంగా పరుగెత్తిన తరువాత వెంటనే నీటిని తాగుతుంటారు.
అలా చేయడం వల్ల బ్లెడ్ ప్రెజర్ పెరిగిపోయి కార్డియాకరెస్ట్ జరిగే చాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పరుగెత్తిన తరువాత కొంత విశ్రాంతి తీసుకొని అనంతరం నెమ్మదిగా కొద్ది కొద్దిగా నీళ్ళు తాగాలని అంటున్నారు. అలాగే కూర్చొని మంచినీళ్లు తాగడం వల్ల అన్ని విధాలా ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు.