చిన్న పిల్లలు నిద్ర పోకుండా అల్లరి చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

by Disha Web Desk 8 |
చిన్న పిల్లలు నిద్ర పోకుండా అల్లరి చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక వారి అల్లరి గురించి రాయాలంటే బుక్‌లో పేజీలే సరిపోవు. వారు ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ..అల్లరి చేస్తూ ఉంటారు. కొంత మంది పిల్లలు ఎప్పుడూ పడుకుంటే, కొందరు మాత్రం నిద్రపోకుండా తమ పేరెంట్స్ నిద్రను కూడా పాడు చేస్తూ అల్లరి చేస్తుంటారు. దీంతో చాలా మంది పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సరిగ్గా నిద్రలేక వారు అనారోగ్య సమస్యలు, ఏ పని మీద ఫొకస్ చేయలేకపోతారు. అలాంటి వారి కోసం బెస్ట్ టిప్స్. ఈ చిట్కాల ద్వారా మీరు మీ పిల్లలను త్వరగా బజ్జో పెట్టి, వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మీరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాగా, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పిల్లల కంఫర్ట్ : వారు పడుకున్నప్పుడు వారు కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారో లేదో చూడాలి. వారు వేసుకున్న డ్రెస్, వారిని గాలి తగిలే ప్రదేశంలో పడుకోబెడుతున్నామా అనేది చూడాలి. అంతే కాకుండా వారికి ఎక్కువగా గాలి వచ్చే ప్రదేశంలో కూడా పడుకోపెట్ట కూడదు. దీని వలన త్వరగా జలుబు చేస్తుంది. అలాగే వారు పడుకునే రూమ్ చల్లగా ఉండేలా చూసుకోవాలి.

నో డిస్టర్బెన్స్ : పిల్లలను పడుకోబెట్టే ముందు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఆ రూమ్‌లోకి ఎలాంటి శబ్ధాలు వినిపించకూడదు. టీవీ, ఫోన్ ఇలా ఏ సౌండ్స్ వినిపించకుండా ఉండాలి. దాని వలన వారు ప్రశాంతంగా నిద్రపోతారు. వారు పడుకున్న తర్వాత ఏ మాత్రం సౌండ్ వినిపించినా వారు చటుక్కునా లేసి అల్లరి చేస్తూ ఉంటారు.

పిల్లల పరుపు విషయంలో జాగ్రత్త : చిన్న పిల్లలు పడుకునే పరుపులు, బెడ్ షీట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిగా నిద్రపట్టి హాయినిచ్చే దుప్పట్లు, స్మూత్ బెడ్ షీట్స్ వాడాలి. అంతే కాకుండా వాటిని ఎప్పటి కప్పుడు ఉతుకుతూ నీట్‌గా ఉంచుకోవాలి.

కడుపు నిండుగా ఉండాలి :చాలా మంది పిల్లలు ఆకలిగా ఉండే సరిగా నిద్రపోలేరు. దీంతో వారు నిద్ర మధ్యలో లేచి ఏడుస్తుంటారు. అందువలన వారికి కడుపు నిండా ఉగ్గు లేదా రైస్ పెట్టి పడుకోపెట్టాలి. ఎందుకంటే నిద్ర వారి ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది. అందువలన పిల్లలు ఎంత ఎక్కువ నిద్ర పోతే అంత ఆరోగ్యంగా ఉంటారు.



Next Story

Most Viewed