- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Best Foods: మహిళల్లో అండాశయ ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ ఫుడ్స్ ఇవే.. సంతానోత్పత్తి కోసం తప్పక తినాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: మనదేశంలో చాలా మంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం భార్యభర్తల ఇద్దరి లోపం ఉంది. ప్రస్తుత రోజుల్లో అందరూ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాగా మహిళలు, పురుషులు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, మహిళల్లో అండాలు హెల్తీగా రిలీజ్ అవ్వాలంటే పలు ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అవిసె గింజలు..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలు తినేవారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. వీటిలో లిగ్నాన్స్ ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు హార్మోన్ల సమతుల్యతను అదుపులో ఉంచుతాయి. అండాశయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బాడీలోని ఈస్ట్రోజన్ లెవల్స్‌ను అవిసె గింజన్‌ల్లో లిగ్నాన్స్ సమతుల్యంగా ఉంచుతాయి. కాగా హార్మోన్ల సమతుల్యత హెల్తీ అండాశయాలను అందిస్తాయి.
సాల్మన్ ఫిష్..
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్ చేప తీసుకుంటే అండాశయాల్లోని తిత్తులు, వాపు సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఈ ఫిష్‌కు ఇన్ఫ్లేషన్‌ను అడ్డుకునే శక్తి ఉంటుంది. ఇందులో సాల్మన్ ఫిష్‌లో విటమిన్ డి ఉంటుంది. ఇవన్నీ అండాశయాలను హెల్తీగా ఉంచుతాయి.
అవకాడోలు..
మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండే అవకాడోలు స్త్రీల పునరుత్పత్తికి సూపర్ మెడిసిన్‌లా పని చేస్తాయి. అవకాడోల్లో హెల్తీ మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో మేలు చేస్తాయి. ఇందులో ఫోలెట్ ఉంటుంది. అండాల అభివృద్దికి మేలు చేస్తుంది. ప్రెగ్నెన్సీ అవ్వాలనుకునే మహిళలు అవకాడోలు తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
నట్స్..
గుమ్మడి గింజలు బాదంం , పొద్దుతిరుగుడు గింజలు, వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. మెగ్నిషియం, జింక్, సెలీనియం వంటివి సమృద్ధిగా ఉండే ఈ నట్స్ అసమతుల్యత సమస్యను నివారిస్తాయి. ఇవి ప్రతిరోజూ తీసుకుంటే అండాశయాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
బెర్రీ ఫ్రూట్స్..
బ్రెర్రీ ఫ్రూట్స్‌లో చాలా రకాలు ఉంటాయి. బ్లూబెర్రీలు, రాస్పెబెర్రీలు, స్ట్రాబెర్రీలు ఇలా పలు రకాల పండ్లు మార్కెట్లో దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ బెర్రీలు తీసుకుంటే శరీరకణాలను ఆక్సీకరణ ఒత్తిడి బారిన పడకుండా రక్షిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి ఎండోక్రైయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. బెర్రీలోని ఫైబర్ ఇన్సూరెన్స్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడంలో తోడ్పడతాయి. అండాశయాల ఆరోగ్యానికి బెర్రీలు చాలా బాగా పనిచేస్తాయి.
ఆకుపచ్చని కూరలు..
ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆకుపచ్చని కూరలు తీసుకుంటే పూర్తి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఫోలెట్ అని పిలువబడే పోషకం ఆకు కూరల్లో ఉండడం వల్ల అండోత్సర్గాన్ని నియంత్రిస్తాయి. హెల్తీ అండాలను రిలీజ్ చేస్తాయి. కాగా ఆకుపచ్చని కూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే అండాశయాల ఆరోగ్యానికి మంచిది. వ్యాయామం ఒత్తిడిని కూడా నివారించండి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More..