పిల్లలను కనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పిస్తా ఇలా తీసుకుంటే హెల్ప్‌ అవొచ్చు..

by Sujitha Rachapalli |
పిల్లలను కనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పిస్తా ఇలా తీసుకుంటే హెల్ప్‌ అవొచ్చు..
X

దిశ, ఫీచర్స్ : వాతావరణ కాలుష్యం, జీవనశైలి, వర్కింగ్ కల్చర్, పెళ్లి వయసు.. ఇలా అన్నీ కలిసి ఫెర్టిలిటీ సమస్యను పెంచేస్తున్నాయి. తల్లిదండ్రులు కావాలనుకున్న కలలను ఛిద్రం చేస్తున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అలా త్వరలో బేబీకి వెల్‌కమ్ చెప్పేందుకు ప్లాన్ చేసుకునేవారు పిస్తా తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. గర్భం దాల్చే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని.. ఫెర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుందని వివరిస్తున్నారు.

పిస్తాలో ఉండే ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్.. పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. విటమిన్ ఈ, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. రోజుకు గుప్పెడు పిస్తా తినడం వల్ల స్పెర్మ్ నాణ్యత, ఫెర్టిలిటీ రేట్, లిబిడో పెరుగుతుంది. అయితే ఇలాంటివి ఫాలో అయ్యే ముందు వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

నోట్ .. ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది.

Next Story

Most Viewed