- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Blood Rain - Blood Sea : రక్తంతో ఎరుపెక్కిన సముద్రం.. ‘‘దేవర’’ సినిమా కాదు.. నిజజీవిత కథ(వీడియో)

దిశ, ఫీచర్స్ : ‘‘దేవర’’ సినిమాలో ఎన్టీఆర్ శత్రువులను మట్టుబెట్టడంతో ‘‘రక్తంతో ఎరుపెక్కిన సముద్రం’’.. ఈ డైలాగ్‌తో ఎన్టీఆర్ ఎలివేషన్ పీక్స్‌కు చేరింది. అయితే ఇదంతా సినిమాటిక్‌గా బాగానే ఉన్నా నిజజీవితంలో ఇలా ఉంటుందా? సముద్రం ఎరుపెక్కడం ఏంటి? అనే ఆలోచన అయితే ఒక్కసారైనా వస్తుంది. కానీ నిజంగానే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇరాన్‌లోని ఓ బీచ్‌లో సముద్రం ఎరుపు రంగులోకి మారింది? భయానక, ఆశ్చర్యకరమైన దృశ్యాలతో ప్రజలను భయపెడుతుంది. భూమి మునిగిపోయే సమయం సమీపించిందని.. అందుకే ఇలాంటి తీవ్రమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం ఈ ప్రాంతంలో ఉన్న నిర్దిష్టమైన నేల కారణంగానే ఇలా జరుగుతుందని చెప్తున్నారు.
ఎందుకు ఇలా జరుగుతుంది?
ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధిలోని రెయిన్‌బో ఐలాండ్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇరానియన్ ప్రధాన భూభాగం నుంచి మైళ్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు ఏడాది పొడవునా విచ్చేస్తారు. అయితే వర్షాలు కురిసినప్పుడు అక్కడి నేల నుంచి వచ్చే వర్షపు నీరు సముద్రంలో కలిసి ఎరుపెక్కుతుంది. ఇరానియన్ టూరిజం బోర్డు ప్రకారం నేలలో ఐరన్ ఆక్సైడ్ అధిక సాంద్రత కారణంగా ఎరుపు రంగు వస్తుంది. నేలలోని ఖనిజాలు సముద్రపు నీటితో మరింత కలిసిపోవడం వల్ల బీచ్‌లో ప్రత్యేకమైన ఎర్రటి మెరుపుకు దారితీస్తుంది. వర్షాకాలం కాకుండా సాధారణ రోజుల్లో తీరం వెంబడి నడుస్తున్నప్పుడు, లోహ సమ్మేళనాలతో ఇసుక మెరుస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం లేదా సూర్యోదయం సమయంలో మంత్రముగ్ధులను చేస్తుంది.
నేల విలువైనదా?
ఈ ఎరుపు రంగు 'జెలాక్' మట్టిని వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. దీనిని పారిశ్రామిక ప్రయోజనాల కోసం, సౌందర్య సాధనాలు, రంగులు వేయడం, సిరామిక్స్, గాజు తయారీలో వినియోగిస్తారు. అంతేకాదు స్థానిక వంటకాలలో ప్రధానంగా జామ్‌లు, సాస్‌లను తయారు చేయడానికి ఈ మట్టిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఎర్రటి తినదగిన నేల, 70 రంగురంగుల ఖనిజాలను కలిగి ఉందని చెప్తున్నారు నిపుణులు.