- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరల్‌గా బర్రెలక్క వెడ్డింగ్ కార్డు.. అక్క మొగుడు దొరికేశాడు అంటూ నెట్టింట రచ్చ (వీడియో)
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి, తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన బర్రెలక్క గురించి అందరికి తెలిసిందే. ‘డిగ్రీలు, బీటెక్‌లు చదివి ఏం లాభం.. ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. అందుకే బర్రెలు కాసుకుంటున్న’ అనే వీడియోతో బర్రెలక్కగా ఫేమస్ అయింది కర్నె శిరీష. తర్వాత గతేడాది తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటి చేసి వార్తల్లో నిలిచింది. ఎలక్షన్ల టైంలో ఎక్కడ చూసిన, విన్నా బర్రెలక్క వీడియోలో కనిపించేవి వినిపించేవి. ఇక ఎలక్షన్లు ముగియగానే అంత అయిపోయింది అనుకున్నారు కానీ, మరోసారి ఫామ్‌లోకి వచ్చింది బర్రెలక్క శిరిష.
తాజాగా తన ఎంగేజ్మెంట్ అంటూ పెళ్లి కూతురిలా మేకప్ వేసుకున్న వీడియో ఒకటి షేర్ చేసింది శిరిష. అయితే.. నిజంగా తన పెళ్లో, లేక బ్యూటీషన్ యాడ్ ఇచ్చిందో తెలియదు కానీ, ఈ వంకన మరోసారి బర్రెలక్కను ఆడేసుకుంటున్నారు కొందరు మీమర్స్. ఈ క్రమంలోనే తనపై ట్రోల్స్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తు్న్నారు. అందులో ఒకటి శిరిష వెడ్డింగ్ కార్డు. మారేడు వారి పెండ్లి పిలుపు అని వైరల్ అవుతున్న పెళ్లి కార్డులో.. వధువు శిరిష, వరుడు వెంకటేష్ పేర్లు ఉండటంతో పాటు.. పెళ్లి ముహూర్తం మార్చి 28 గురువారం అని కూడా అందులో ప్రింట్ చేసి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ‘బర్రెలక్క మొగుడు దొరికేసాడు’ అని ‘ఇది ఎన్నో పెళ్లి’, ‘అసలు బర్రెలక్క పెళ్లి విషయం ఆమెకు తెలుసా’ అంటూ రకరకాల కామెంట్లు వస్తు్న్నాయి.