Ravi Teja పాట వింటూ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న Balayya Babu.. ఎక్కడో తెలుసా? (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-06 08:17:12.0  )
Ravi Teja పాట వింటూ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న Balayya Babu.. ఎక్కడో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌లతో ఇటీవల మాంచి జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘నేలకొండ భగవంత్ కేసరి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ కాజల్ ఫీమేల్ లీడ్ చేస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు రిలీజ్ ఉండటంతో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా అనిల్ రావిపూడి ప్లాన్‌గా వ్యవహరిస్తున్నారు.

బాలయ్య కూడా అటు పాలిటిక్స్‌లో ఇటు షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బాలయ్య షూటింగ్స్ స్పాట్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని ఓ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించారు. హోటల్‌లో రవితేజ ధమాకా సినిమాలోని పాట వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : Chiranjeevi ఇంట్లో Bala Krishna సినిమా షూటింగ్

Read More: భారత్ నుంచి ఆస్కార్ బ‌రిలో ‘2018’.. తెలుగు సినిమాల‌కు నిరాశే!

Advertisement

Next Story