ఎదిగాక బిడ్డ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తున్న తల్లిపాలు.. ఇవ్వకపోతే బతకడం కష్టమే..

by Harish |   ( Updated:2023-04-07 11:23:20.0  )
ఎదిగాక బిడ్డ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తున్న తల్లిపాలు.. ఇవ్వకపోతే బతకడం కష్టమే..
X

దిశ, ఫీచర్స్: ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పుట్టిన బిడ్డకు కనీసం ఆరు నెలలైనా తల్లిపాలు ఇవ్వాలి. కానీ ఈ మోడ్రన్ ప్రపంచంలో దీన్ని ఫాలో అవుతున్న తల్లుల సంఖ్య క్రమేణా తగ్గుతుంది. ఈ విషయంలో భారతదేశం గర్వించదగిన స్థితిలో ఉండగా.. అత్యల్ప స్థాయిలో ఉంది బ్రిటన్. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తుకు తల్లిపాల ఆవశ్యకతపై రీసెర్చ్ చేసిన గ్లాస్గో విశ్వవిద్యాలయ పరిశోధకులు.. 2004 నుంచి స్కాట్లాండ్‌లో జన్మించిన 191,745 మంది పిల్లల ఆరోగ్యం, విద్యా డేటాను పరిశీలించారు. వీరంతా 2009 నుంచి 2013 వరకు ప్రత్యేక విద్యా అవసరాలు (SEN-Special Educational Needs)కు అటెండ్ అయ్యారు.


అధ్యయనంలో చేర్చబడిన పిల్లల్లో మొదటి ఆరు నెలల పాటు 66.2 శాతం మంది పిల్లలు డబ్బా పాలు పొందగా.. 25.3 శాతం మంది తల్లి పాలు త్రాగారు. 8.5 శాతం మంది తల్లిపాలు, డబ్బా పాలు రెండూ త్రాగారు. మొత్తానికి ఈ అధ్యయనంలో 12.1శాతం మంది స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ పొందుతున్నారు. ఏదేమైనా ఫార్మూలా ఫీడింగ్, మిక్స్‌డ్ ఫీడింగ్‌తో పోలిస్తే.. బ్రెస్ట్ ఫీడింగ్ పొందిన పిల్లల్లో ప్రత్యేక విద్యా అవసరాలు పొందాల్సిన అవసరం 10-20 శాతం వరకు తగ్గింది.


అంతేకాదు ఎమోషనల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, శారీరక అనారోగ్య పరిస్థితులను కలిగి ఉండే అవకాశం ఐదో వంతు తక్కువగా ఉంది. క్యాన్సర్లు, హృదయ సంబంధ వ్యాధుల అవకాశాలను తగ్గించడం.. బిడ్డ అభివృద్ధికి సరైన పోషకాహారాన్ని అందించడంతోపాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి తల్లిపాలు కాపాడుతున్నాయి. ఫైనల్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఆ శిశువు భవిష్యత్తులో ఎదిగే తీరు.. సామాజిక, ఆర్థిక స్థితిని కూడా నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు.


Read More:

Drumstick Seeds: మునగ గింజలు వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed