సమ్మర్‌ అని నైటీలు వేసుకుంటున్నారా.. జాగ్రత్త పాటించకుంటే ముప్పు తప్పదు!

by Disha Web Desk 6 |
సమ్మర్‌ అని నైటీలు వేసుకుంటున్నారా.. జాగ్రత్త పాటించకుంటే ముప్పు తప్పదు!
X

దిశ, ఫీచర్స్: ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. దీంతో సూర్యుడి భగభగలకు ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు భయపడిపోయి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంట్లోనే ఉంటూ చల్లగా కూలర్, ఏసీ కింద ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. చల్లటి పానీయాలు వెంట తీసుకుని మరీ వెళుతున్నారు. అయితే ఎండాకాలం పోయేవరకు చాలా మంది శరీరాన్ని చల్లబరుస్తూ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాటన్ దుస్తులు ధరిస్తుంటారు.

ముఖ్యంగా మహిళైతే ఎండ వేడి తగ్గే వరకు నైటీల మీద తప్ప చీర, డ్రెస్‌ల్లో కనిపించరు. చీరలో కంటే నైటీలో చాలా కంఫర్టబుల్‌ ఉంటుంది కాబట్టి ఎక్కువగా దాన్నే ధరిస్తుంటారు. అయితే ఒకప్పుడు కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే మహిళలు నిద్ర బాగా పట్టాలని నైటీలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం, సమయం తో సంబంధం లేకుండా నైటీల్లోనూ కనిపిస్తున్నారు. అలాగే పండగ పబ్బం అని చూడకుండా నైటీలను ధరించి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక సమ్మర్‌లో అయితే ఎప్పుడు చూసినా మహిళలు నైటీలోనే ఉంటారు. స్నానం చేయగానే నైటీ ధరించి దానిపైనే ఇల్లంతా తిరుగుతూ పనులు చేస్తుంటారు. కారణం ఏదైనప్పటికీ ఆడవాళ్లు నైటీ కి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం బాగా పెరిగిందనడంతో అతిశయోక్తి లేదు.

అయితే పెద్ద వాళ్ళు మాత్రం చీరలోనే ఉండాలని నైటీ అంత బాగుండదని అంటుంటారు. అయినప్పటికీ వివాహితలు తమ కంఫర్ట్ కోసం నైటీలు ధరిస్తుంటారు. అయితే సమ్మర్‌లో నైటీలు వేసుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు మహిళలు కాటన్ కాకుండా సిల్క్, పాలిస్టర్ నైటీలు వేసుకుంటుంటారు. అలాంటి వారికి పలు చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి ఎండాకాలం పోయేవరకు కాటన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆడవాళ్లు కిచెన్లో వంట చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు చెమటలు వస్తుంటాయి. చేతులు తడిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా అంటుకున్నప్పుడు అదే నైటీకి తుడుచుకుంటుంటారు.

ఆ తర్వాత అదే చేతితో భోజనం చేస్తారు. దీంతో తెలియకుండానే క్రీములు మన శరీరంలోకి వెళ్లి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అయితే చెమటలు తుడుచుకుంటూ ఉంటే.. బ్యాక్టీరియా ఫామ్ అయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అయితే కొందరు పదే పదే ఒకే నైటీని ఉతకకుండా ధరిస్తూ ఉంటారు. దీంతో చెమట వల్ల పలు ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా జాగ్రత్తగా ఉండటం మంచిది లేదంటే.. మీ వల్ల వారికి హాని కలుగుతుంది. కాబట్టి ఒకే నైటీని ఎక్కువ రోజులు వాడకుండా.. చెమటలు పట్టగానే స్నానం చేసి రోజుకు కనీసం మూడు నైటీలైనా మార్చాలట. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటుగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.



Next Story

Most Viewed