- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిన్న తర్వాత సోడా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..?

దిశ,వెబ్ డెస్క్: భోజనం చేసిన తర్వాత పొట్టలో ఇబ్బందిగా అనిపించినప్పుడు కొందరు సోడా, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. మరి కొందరు నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. దీని వల్ల కడుపులో కాస్తా రిలాక్స్‌గా ఉంటుందని ఫీల్ అవుతుంటారు. కానీ, తర్వాత అనారోగ్య సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సోడా ఆగితే
భోజనం చేశాక సోడా తాగితే ఆకలిని పెంచుతుంది. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ, ఇది తాత్కాలికంగా మాత్రమే. తిన్నాక సోడా తాగడం వలన గ్యాస్ పెరుగుతుంది. దీంతో అనేక సమస్యలొస్తాయి.
గ్యాస్ పెరిగితే..
కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. దీంతో కూర్చోలేరు, నించోలేరు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే విధంగా కొంతమందికి గుండెల్లో మంట, వెన్నునొప్పి వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
ఆ సమయంలో ఏం తాగాలి?
భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తిన్న తర్వాత గోరు వెచ్చని నీరు తాగడం చాలా మంచిది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా కూడా తీసుకోండి.