- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనం తినే కూరగాయలు విదేశాలవా? ఆశ్చర్యపోకండి.. ఆధారాలు ఇవే!
దిశ, ఫీచర్స్: వంటలు వెజ్ అయినా, నాన్‌వెజ్ అయినా కూరగాయలు తప్పనిసరిగా వాడుతుంటాము. అయితే, మనం రోజూ తినే కూరగాయలు మన దేశంలో పుట్టలేదంటే మీరు నమ్ముతారా. మం ప్రతి రోజు వాడే కూరగాయలు మన దేశానికి చెందినవి కావు. వీటి మూలాలు వేరే దేశాల్లో ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కూరగాయలు ఇతర దేశాల నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యాయి. వాటిలో టమాట, బంగాళాదుంప, పచ్చిమిర్చి వంటివి విదేశాలకు చెందిన కూరగాయలు. అసలు ఈ కూరగాయలు ఏ దేశానికి చెందినవి? వీటిని ఎవరు తీసుకోచ్చారు? మన దేశానికి చెందిన కూరగాయలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట: టమాట అనేది వంటకు ముఖ్యమైన కూరగాయ. నిత్యం ఇంట్లో టమాట అవసరం ఉంటుంది. అసలు టమాట లేకుండా చాలా కూరలు తయారవ్వవు. దేశ వ్యాప్తంగా కూడా ఈ టమాట పంటను ఎక్కువగా పండిస్తున్నారు. కానీ, ఈ టమాట మన దేశానికి చెందినది కాదు. ఇది సౌత్ అమెరికాకు చెందినది. టమాట సౌత్ అమెరికాలోని ప్రధాన పంటల్లో ఒకటి. దీనిని పోర్చుగీసుకు చెందిన వ్యాపారులు భారత్‌కు తీసుకొచ్చారు.
బ్రకోలి: ఇటీవల చాలామంది వంటలలో దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ, ఇది ఇటలీకి చెందిన కూరగాయ. మరొక కూరగాయ క్యాప్సికం. ప్రస్తుతం బాగా ఉత్పత్తి అవుతున్న వాటిలో ఈ క్యాప్సికం ఒకటి. వీటిని ఎక్కువగా బెంగుళూరు నుంచి లోకల్ మార్కెట్లకు దిగుమతి చేసుకుంటారు. అయితే, ఈ క్యాప్సికం పుట్టింది అమెరికాలో.
బెండకాయ: బెండకాయ కూడా భారతదేశానికి చెందినది కాదు. దీనిని ఈజిప్టులో ఎక్కువగా పండిస్తారు. అక్కడి నుంచే ఈ బెండకాయ భారత్‌కు వచ్చింది. అయితే, దీనిని ఈజిప్టియన్లు తీసుకొని రాలేదు. ఈజిప్టులో ఉండే బంటు అనే ఓ గిరిజన తెగకు చెందిన వ్యాపారులు, అప్పట్లో పడవల ద్వారా భారతదేశానికి తీసుకొచ్చారు. ఈజిప్టులో ఉండే కొన్ని వస్తువులను భారతీయులకు ఇచ్చి, ఇక్కడ ఉన్న సుగంధ ద్రవ్యాలను వాళ్లు తీసుకెళ్లేవారు. అలా బెండకాయను ఈ తెగ వారు ఇక్కడ పరిచయం చేశారు.
క్యారెట్: ఈ క్యారెట్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి మన దేశంలోకి వచ్చింది. అప్పట్లో ఇవి ఊదా లేదా పసుపు రంగులో ఉండేవి. ఇది మాత్రమే కాదు క్యాలీఫ్లర్, క్యాబేజీ, బీట్‌రూట్ కూడా విదేశాల నుంచి వచ్చినవే. బీట్‌రూట్ యూరప్,ఈజిప్టులో పుట్టింది. క్యాలీఫ్లవర్ ఆఫ్రికాలోని మెడర్రేనియా అనే ప్రాంతం నుంచి వచ్చింది. ఇక, క్యాబేజీ యూరప్ దేశాల నుంచి భారతదేశానికి బ్రిటీష్ పాలకులు, అక్కడి వ్యాపారులు తీసుకొచ్చారు. ఇలా చాలా వరకు విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన కూరగాలు ఉన్నాయి.
దేశీ కూరగాయలు: వంకాయ, దొండకాయ, బీరకాయ, ముల్లంగి, కాకరకాయ, సొరకాయ వంటివి మన దేశ కూరగాయలు
Read More ...
Amla : ఔషధ గుణాల ఉసిరి.. చలికాలంలో తింటే ఎన్ని ప్రయోజనాలో చూడండి!