డేటింగ్ యాప్స్ సురక్షితమేనా?.. quackQuack సర్వే చెప్తున్నదేంటంటే..

by Prasanna |   ( Updated:2023-04-03 08:35:36.0  )
డేటింగ్ యాప్స్ సురక్షితమేనా?.. quackQuack సర్వే చెప్తున్నదేంటంటే..
X

దిశ, ఫీచర్స్: డేటింగ్ యాప్స్‌ నావిగేట్ చేయడం కొందరికి ఉత్సాహాన్నిస్తే, మరికొందరిని నిరుత్సాహ పరుస్తోంది. వీటిలో ఏర్పడిన సంబంధాల ద్వారా కొందరు ప్రయోజనం పొందుతుంటే.. ఇంకొందరు మోసపోతున్నారు. అయినా డేటింగ్ యాప్‌లలోకి ప్రవేశించకుండా ఉండలేకపోతున్నారట పలువురు. వాటివల్ల తాము చక్కటి అనుభూతిని పొందుతున్నామని కొందరు పేర్కొంటున్నారు. క్వాక్‌క్వాక్ (quackQuack) అనే డేటింగ్ యాప్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రతీ 10 మందిలో ఇద్దరు డేటింగ్ యాప్‌లో సంబంధాల గురించి, గత చేదు అనుభవాల గురించి చర్చిస్తున్నారు. ఈ సర్వేలో మెట్రో సిటీస్‌తో పాటు పలు చిన్న పట్టణాల నుంచి 11 వేలమంది పాల్గొన్నారు. తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలా పంచుకున్నవారిలో నిపుణులతోపాటు 20 నుంచి 35 ఏళ్లలోపు వయస్సుగల యువత, విద్యార్థులు ఉన్నారు.

క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో రవి మిట్టల్ మాట్లాడుతూ.. ‘‘గత నెలలో 35 మిలియన్ల చాట్‌లు మార్పిడి చేయబడ్డాయి. ఈ చాట్‌లలో దాదాపు 9% డేటర్‌లు వర్ధమాన సంబంధం గురించి, తమ మ్యాచ్‌ల విషయంలో ఆందోళనల గురించి పంచుకోవడం వంటి అంశాలు ఉన్నాయి’’ అన్నారు. టైర్ 1, 2 నగరాల నుంచి ప్రతీ 8 మంది డేటర్‌లలో ముగ్గురు డేటింగ్ చేసే వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడానికి సదరు వ్యక్తుల సోషల్ మీడియా ఉనికిని చూస్తున్నారు. ఆయా వ్యక్తులు తమ వ్యక్తిగత డేటాను, డేటింగ్ యాప్ లేదా సోషల్ మీడియాలో పొందుపరచడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ఇటువంటి డేటా ఆధారంగా సంబంధిత వ్యక్తులను పర్సనల్‌గా కలవడం, వారితో రిలేషన్ కొనసాగించడం సురక్షితమా? కాదా అని ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుందని యూజర్లు చెప్తున్నారు. అయితే మహిళా డేటర్లలో 27% తమ మంది ఆన్‌లైన్ ఉనికిని కలిగిలేని వ్యక్తులుగా, డేటింగ్ యాప్2లో అనుమానాస్పదంగా ఉన్నారని సర్వేలో తేలింది. అలా ఉండటం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడుతుంటే.. చాలామంది సోషల్ మీడియా ఉనికిని కలిగి ఉండకపోవడమే ఇప్పుడు ఆకర్షణీయంగా మారిందని చెప్తున్నారు. ఫైనల్‌గా సర్వే సారాంశం ఏంటంటే డేటింగ్ యాప్‌లవల్ల యూజర్లకు సౌకర్యంతోపాటు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. డేటింగ్ యాప్‌ల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ వాటిలో ప్రవేశించే వ్యక్తుల వ్యక్తిత్వాలు, లక్ష్యాలు, బిహేవియర్లు భిన్నంగా ఉండవచ్చు. ఇటువంటి సమస్యలను పరిష్కరించాలంటే.. ప్రాబ్లం ఎదుర్కొన్నవారు యాప్ నిర్వహించే సర్వేలో అనుభవాలను పంచుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటామని క్వాక్‌క్వాక్ డేటింగ్ యాప్ నిర్వాహకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: సెక్స్ ఎప్పుడు చేయాలి...?

Advertisement

Next Story