అంబానీ ఇంట పెళ్లి అంటే ఆమాత్రం ఉంటుందిలే.. ఓ దేశంలో సంగీత్ అయితే మరో దేశంలో మ్యారేజ్..

by Dishafeatures3 |
అంబానీ ఇంట పెళ్లి అంటే ఆమాత్రం ఉంటుందిలే.. ఓ దేశంలో సంగీత్ అయితే మరో దేశంలో మ్యారేజ్..
X

దిశ, ఫీచర్స్: అంబానీ ఇంట పెళ్లి సందడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, బిజినెస్ టైకూన్ విరెన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ తో ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జనవరిలోనే జరిగిపోయాయి. హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరుకాగా అత్యంత వైభవంగా ఈ ఈవెంట్ పూర్తి అయింది.

ఇక ఇప్పుడు అసలు పెళ్లి ఎప్పుడనే డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ప్రీవెడ్డింగ్ ఎలాగూ ఇండియాలో జరిగింది కాబట్టి మ్యారేజ్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. అది కూడా UAE రాజధాని అబుదాబిలో సంగీత్ జరిగితే ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో వివాహ మహోత్సవం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లండన్ లోని స్టోక్ హోటల్ లో అతిథులకు రూమ్స్ కూడా బుక్ అయ్యాయని.. నీతా అంబానీ దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక మరోవైపు కాబోయే వధూవరులు అనంత్ - రాధిక షాపింగ్ లో బిజీగా ఉన్నారు.



Next Story

Most Viewed