మొబైల్ సిగ్నల్స్‌ ఆధారంగా ఏలియన్స్ ఫోన్ కాల్.. భయానక వాతావరణం

by Anjali |
మొబైల్ సిగ్నల్స్‌ ఆధారంగా ఏలియన్స్ ఫోన్ కాల్.. భయానక వాతావరణం
X

దిశ, ఫీచర్స్: ఏలియన్స్‌కు సంబంధించిన చిన్న విషయమైనా ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉంటోంది. గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తే ఏం జరుగుతుందనే టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా చర్చించబడుతోంది. అయితే అంతరిక్షం మూలాల్లో ఏలియన్స్ ఆనవాళ్లు కనుగొనేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు టెలీస్కోప్స్, యాంటెన్నాలను అమర్చగా.. లేటెస్ట్ సైంటిఫిక్ స్టడీ ప్రకారం మొబైల్ టవర్ సిగ్నల్స్‌ ఆధారంగా అవి మనను కనిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రపంచంలో మిలియన్ల మంది జీవితాల్లో మొబైల్ ఫోన్ భాగమైపోగా.. ఫోన్ నెట్‌వర్క్‌లకు విస్తారమైన రేడియో ట్రాన్స్‌మిషన్ టవర్లు అవసరం.

భూమిపై రేడియో సిగ్నల్స్ మొత్తం పరిమాణంలో కొంత భాగం అంతరిక్షంలోకి కూడా లీక్ అవుతుంది. మిలిటరీ రాడార్ నుంచి వచ్చే తరంగాలు ఇప్పటికీ భూమి నుంచి రేడియో లీకేజీలో ప్రధాన భాగంగా ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో సెల్ పవర్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ప్రతి సెల్ టవర్ 100-200 వాట్ల శక్తితో రేడియో సిగ్నల్‌ను విడుదల చేస్తుంది. గ్రహం మీద పెద్ద సంఖ్యలో మొబైల్ టవర్లు ఉన్నందున, కొన్ని గిగావాట్ల రేడియో సిగ్నల్‌లు అంతరిక్షంలోకి ప్రవేశించాయని అంచనా. కాగా ఒక గ్రహాంతర నాగరికత అధునాతన రేడియో ఖగోళ శాస్త్ర సామర్థ్యాలను కలిగి ఉన్నట్లయితే.. భూమి నుంచి రేడియో లీకేజీని డజను కాంతి సంవత్సరాలలోపు గుర్తించవచ్చు. ఏదో ఒక రోజు ఏలియన్స్ నుంచి మానవులకు మొబైల్ కాల్ రావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. కాగా రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీస్ మంత్లీ నోటీస్‌ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రచురించబడింది.

Advertisement

Next Story

Most Viewed