చనిపోయిన వ్యక్తులతో మాట్లాడే ఛాన్స్.. 'ఏఐ' టెక్నాలజీతో ' సాధ్యం

by Mahesh |   ( Updated:2022-10-20 15:13:50.0  )
చనిపోయిన వ్యక్తులతో మాట్లాడే ఛాన్స్.. ఏఐ టెక్నాలజీతో  సాధ్యం
X

దిశ, ఫీచర్స్: ఇష్టమైన వ్యక్తులు చనిపోతే ఆ బాధ నుంచి కోలుకోవడం కష్టం. వారి జ్ఞాపకాలు అనునిత్యం డిస్టర్బ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి బాధల నుంచి కొంతవరకు తేరుకునేలా మరణించిన వ్యక్తుల వర్చువల్ ఫామ్స్‌తో మాట్లాడే అవకాశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తోంది. ఈ టెక్నాలజీ ఆధారితమైన 'గ్రీఫ్ టెక్' ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. MIT టెక్నాలజీ రివ్యూ ప్రకారం, ఇటీవల మరణించిన వ్యక్తుల చిత్రాలు, రికార్డింగ్స్, ఫుటేజీలపై AIకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా AI సదరు వ్యక్తి వర్చువల్ రూపాన్ని సృష్టిస్తుంది. దుఃఖంలో ఉన్నవారిని మరణించిన వారితో సంభాషించడానికి వీలు కల్పిస్తుంది.

MIT(మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి చెందిన షార్లెట్ జీ.. 'Here after AI' అని పిలవబడే ఒక గ్రీఫ్ టెక్ స్టార్టప్ సేవలను తన కోసం ఉపయోగించుకుంటోంది. ఇది మనం ఇష్టపడే వ్యక్తులతో సన్నిహితంగా ఉండటాన్ని సులభతరం చేస్తుంది. అయితే HereAfter వంటి స్టార్టప్స్‌కు.. ఆ డేటాసెట్ నుంచి సంభాషణలు రూపొందించేందుకు స్పెసిఫిక్ ప్రాంప్ట్స్ ఆధారంగా గంటల కొద్దీ రికార్డింగ్స్ అవసరం. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. Here after అనేది మీ జీవితం గురించి అర్థవంతమైన జ్ఞాపకాలను కాపాడుకునేందుకు అనుమతించే ఒక యాప్'

ఇలాంటి ఉత్పత్తులపై అనేక ఇతర కంపెనీలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు UK-ఆధారిత స్టోరీ ఫైల్.. మరణించిన వ్యక్తుల హోలోగ్రాఫిక్ వెర్షన్స్‌ను వారి సొంత అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతిస్తుంది. ఇది వింతగా అనిపించినప్పటికీ, సన్నిహితులు లేని లోటును పూడ్చుకోలేక పోతున్న చాలా మందికి ఇటువంటి పరిష్కారాలు ఉపయోగపడతాయి. డిస్‌ప్లేలో ఉన్న పాత రికార్డింగ్స్ సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నప్పటికీ, చనిపోయిన మీ ప్రియమైన వారిలా మాట్లాడే, ఇంటరాక్ట్ అయ్యే AI పర్సనాలిటీ.. కొంచెం ఎక్కువ ఇంటరాక్టివిటీని అందించవచ్చు.

ఇవి కూడా చదవండి :

ఈరోజు ప్రత్యేకత: 'వరల్డ్ స్టాటిస్టిక్స్ డే'..

Advertisement

Next Story