- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. శరీరం నిండా బొక్కలు, పుర్రెలు వేలాడుతుంటే.. ఈ మోడల్స్ హంగామా చూడండి..
దిశ, ఫీచర్స్ : ఫ్యాషన్ షో అంటే ఎలా ఉంటుంది? అందమైన అవుట్‌ఫిట్స్, జ్యువెల్లరీలో అంతకన్నా అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే.. అబ్బా.. చూసేందుకు కళ్లు సరిపోవు కదా. వీటిలో కొన్ని సంప్రదాయకంగా ఉంటే..మరికొన్ని మరీ బోల్డ్‌గా ఉంటాయి. ఒక్కోసారి అవుట్‌ఫిట్ సరిగ్గా సెట్ కాక స్టేజ్‌పైనే ఊడిపోయి.. పురువు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా సరే మోడల్స్ మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ హ్యాండిల్ చేసిన ఇన్‌స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతున్న మోడల్స్ అవుట్ ఫిట్స్ మరో ఎత్తు. ఎందుకంటే ఇవి ఏఐ ఇమాజిన్డ్ డ్రెస్సెస్.
డిజైన్ ఐడియా హబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసిన మోడల్స్ దుస్తులు వైరల్ అయ్యేందుకు కారణం ఇవి పూర్తిగా బొక్కలు, పుర్రెలతో నిండిపోవడమే. మోడళ్లు అందంగా ఉన్నారు కానీ వారు వేసుకున్న దుస్తులే దెయ్యాల సినిమాల్లో విలన్స్ ధరించినట్లుగా ఉన్నాయి. వెన్నుపూసతో సహా అన్ని బాడీ పార్ట్స్‌ను జ్యువెల్లరీగా ధరించిన మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తూ హోయలుపోతున్నట్లు కనిపిస్తున్న ఫొటోస్ చూసిన నెటిజన్స్.. మెడికల్ స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతాయని కామెంట్స్ చేస్తున్నారు. ఏఐ ఇమాజినేషన్ కిల్లింగ్ అంటూ ఇంకొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.