మరణం తర్వాత మనిషి తనతో ఒకే ఒక్కటి తీసుకెళతాడు: Chanakya Neeti

by Hamsa |   ( Updated:2023-07-15 15:21:51.0  )
మరణం తర్వాత మనిషి తనతో ఒకే ఒక్కటి తీసుకెళతాడు: Chanakya Neeti
X

దిశ, వెబ్ డెస్క్: మనిషి బ్రతికున్నప్పుడు రాజభోగాలు అనుభవిస్తాడు. కొంత మంది ఒంటినిండా నగలు వేసుకుని ప్రత్యేకమైన వంటకాలు తింటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎంత ధనవంతులైనా సరే చనిపోయాక తన వెంట ఆస్తులు కానీ, మరే ఇతర వస్తువులు కానీ, తీసుకెళ్లలేడు. అలాగే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కానీ, చావును అసలు ఎవ్వరూ ఆపలేరన్న విషయం అందరికీ తెలిసిందే.

ఒక్కసారి మృతి చెందిన వారికి లోకంతో సంబంధం ఉండదు కాబట్టి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారని అంటుంటారు. అయితే మనిషి జీవితంలో జరిగే పలు విషయాల గురించి చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు తెలిపారు. ఇప్పుడు మనిషి చనిపోయాక ఒకే ఒక్క దాన్ని తన వెంట తీసుకెళతాడని చెప్పాడు.

మనిషి పుట్టుకతో ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వస్తాడు. మరణం తర్వాత కూడా ఒంటరిగా వెళ్లిపోతారు. మనిషి మంచి పనులు చేసిన, చెడ్డ పనులు చేసినా వాటి కర్మ ఫలాన్ని మాత్రం తప్పక అనుభవిస్తారు. అందువల్ల మంచి కర్మఫలాన్ని తనతో తీసుకెళతాడని చాణక్యుడు తెలిపారు. అలాగే మంచి పనులు మాత్రమే చేయడం వల్ల వచ్చే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed