యుక్త వయస్సులో మద్యపానంతో దెబ్బతింటున్న మెదడు

by Prasanna |   ( Updated:2023-06-13 07:01:42.0  )
యుక్త వయస్సులో మద్యపానంతో దెబ్బతింటున్న మెదడు
X

దిశ, ఫీచర్స్: కౌమార దశలో అధిక మద్యపానం అలవాటు ఉన్నవారికి దీర్ఘకాలిక మెదడు సమస్యలు తలెత్తుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితి న్యూరాన్లు లేదా మెదడు కణాల శాశ్వత క్రమబద్దీకరణకు కారణం అవుతుందని, బ్రెయిన్ డెవలప్ మెంట్, న్యూరో సిగ్నల్స్, కమ్యూనికేట్ సామర్థ్యం దెబ్బతింటుందని పరిశోధకులు అంటున్నారు. ఫలితంగా జ్ఞాపశక్తి తగ్గడం, లాంగ్ టెర్మ్ బిహేవియరల్ మార్పులకు దారితీస్తుందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ నిక్కీ క్రౌలీ పేర్కొన్నారు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 30 రోజుల వ్యవధిలో ఎలుకలకు ఆల్కహాల్ యాక్సెస్ ఇచ్చారు. వాటి వేగవంతమైన అభివృద్ధి, తక్కువ జీవితకాలం కారణంగా ఇది మానవ సంవత్సరాల్లో సుమారుగా 11 నుంచి18 సంవత్సరాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. అయితే ఆల్కహాల్‌ను తరచుగా సేవించిన ఎలుకల బ్రెయిన్ డెవలప్ మెంట్ ఆగిపోయినట్లు, వాటి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అంతేగాక మెదడులో తెలివికి కారణమైన ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ అనే ప్రాంతం దెబ్బతినడం గమనించారు. నిజానికి ఇది మానవ మెదడులో కూడా కీలకమైన భాగం. అసెస్‌మెంట్ అండ్ డెసీషన్ మేకర్‌గా పనిచేస్తుంది. ఇది యుక్త వయస్కుల్లో అభివృద్ధి చెందే దశలో ఉంటుంది. సుమారు 25 ఏళ్ల వరకు పరిపక్వం చెందుతూనే ఉంటుంది. కాబట్టి అంతకంటే తక్కువ వయస్సు కలిగినవారు ఆల్కహాల్ సేవించడంవల్ల బ్రెయిన్‌లోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌కు డెవలప్‌మెంట్‌కు ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా మెంటల్ డిజార్డర్స్, జ్ఞాపపక శక్తి తగ్గడం, నాన్ మెచ్యూరిటీ వ్యక్తులుగా ఎదగడం వంటి దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకే 25 ఏళ్లలోపు వారు ఎట్టిపరిస్థితుల్లో‌నూ మద్యం సేవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: చెమటలు పడితే మంచిదా.. కాదా?

80 శాతం మందిని వేధిస్తున్న మార్నింగ్ సిక్‌నెస్.. బయటపడే మార్గాలివే

Advertisement

Next Story

Most Viewed