Viral Video : ఓర్నీ.. ఇదెక్కడి విచిత్రం భయ్యా.. సూట్‌కేస్‌‌ను కేక్ ముక్కలా నమిలి తినేస్తున్న యువతి!

by Javid Pasha |   ( Updated:2024-09-04 06:54:41.0  )
Viral Video : ఓర్నీ.. ఇదెక్కడి విచిత్రం భయ్యా.. సూట్‌కేస్‌‌ను కేక్ ముక్కలా నమిలి తినేస్తున్న యువతి!
X

దిశ, ఫీచర్స్ : ఇంట్లో ఉన్నా, జర్నీ చేస్తున్నా ఆకలి వేస్తే ఎవరైనా ఏం చేస్తారు?, స్నాక్స్ గానీ, పండ్లు గానీ, వెంట తెచ్చుకున్న ఇతర ఆహార పదార్థాలు గానీ తింటారు. అయితే ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. ఆకలిని తట్టుకోలేక ఏకంగా ఆమె తన వెంట తెచ్చుకున్న లగేజీ సూట్‌ కేసునే స్నాక్స్‌లా, బ్రెడ్ ముక్కలా నమిలి తినేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ వామ్మో ఇదేం విచిత్రం భయ్యా.. అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సూట్‌కేస్ ఎందుకు తిన్నట్లు? అదెలా సాధ్యమైంది?

వైరల్ వీడియో సమచారం ప్రకారం.. అదొక ఎయిర్ పోర్ట్ (airport) వెయిటింగ్ హాల్.. తమ తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎవరి ప్లేస్‌లో వాళ్లు కూర్చొని ఉన్నారు. మరి కొందరు ఎంక్వైరీ కౌంటర్ వద్ద, ఇంకొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా ఇంతలోనే అక్కడ ఓ బెంచ్ వద్ద కూర్చొని ఉన్న యువతి అకస్మాత్తుగా తన సూట్‌కేస్‌ను చేతులతోనే విరగ్గొట్టి దాని ముక్కలను గాబరాగా తినడం ప్రారంభించింది. అలా తింటూ సూట్‌కేస్‌తోపాటు అటూ ఇటూ తిరుగుతోంది కూడా. అయితే ఇది చూసిన చుట్టు పక్కల వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో, ఆమె ఎందుకలా తింటుందో అర్థం కాక మరికొందరు అలా చూస్తూ ఉండిపోయారు. కాగా చివరికి అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తింటున్నది నిజమైన సూట్‌కేస్ కాదు. అది కేక్‌తో తయారు చేసింది. అంటే ఆమె తిన్నవి కేక్ ముక్కలన్నమాట. ఏ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. అందరి దృష్టినీ ఆకర్షించడానికి, వెరైటీగా రీల్ చేయడానికి ఆ యువతి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Video Credits To Mayaracarvalho Insta Id

Advertisement

Next Story

Most Viewed