- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివాహిత పురుషుల్లో వర్క్‌ప్లేస్ బర్నవుట్ తక్కువ.. కారణం అదేనట!
దిశ, ఫీచర్స్: వ్యక్తుల్లో సంతృప్తి క్షీణించడానికి దారితీసే మానసిక పరిస్థితిని బర్నవుట్ (burnout) అంటారు. ఇది గణనీయమైన మానసిక అలసటకు కారణమవుతుంది. భావోద్వేగాల సందర్భంలో మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే వివాహితులైన పురుషులు తాము ఉద్యోగం చేసే కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో దీనిని అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, సంతృప్తి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. రష్యాలోని నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(HSE)కు చెందిన పరిశోధకులు ఈ విషయం తెలుసుకోవడానికి 203 మంది ఉద్యోగులను స్టడీ చేశారు. వివిధ అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వ్యక్తిగత సంబంధాలు, కార్యాలయంలో బర్న్ అవుట్ లక్షణాలను ఎలా ప్రభావితం చేస్తాయోనని పరిశీలించారు. అయితే వైవాహిక సంతృప్తి స్థాయి పెరిగేకొద్దీ, బర్న అవుట్ ప్రమాదం తగ్గుతుందని, ముఖ్యంగా పురుషుల్లోనే ఈ పరిస్థితి అధికంగా ఉందని కనుగొన్నారు.
నిజానికి వర్క్‌ప్లేస్ బర్న్ అవుట్ ఉద్యోగి పనితీరుపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ పెళ్లయిన మగవారిలో ఇటువంటి సమస్యలు లేకపోవడం సంస్థలకు మేలు చేసే విషయంగా నిపుణులు చెప్తున్నారు. మగవారు పర్సనల్ రిలేషన్‌షిప్స్‌లో, వైవాహిక జీవితంలో అనుభవించే ఆనంద మయ క్షణాలు, ఉద్యోగ నిర్వహణలో అవసరమైన స్కిల్స్ పెంపొందిచుకోవడానికి భాగస్వామి ద్వారా లభించే సపోర్టు వర్క్‌ప్లేస్ బర్న్ అవుట్ సిండ్రోమ్ డెవలప్ అవడాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయట. ఇక మ్యారేజ్ అండ్ కెరీర్‌కు సంబంధిత అంశాల్లో పురుషులకు, స్త్రీలకు ఆపాదించబడిన సోషల్ రోల్స్, మూస పద్ధతుల్లోని అసమానతలు వంటివి పురుషులకే ఎక్కువగా అనుకూలంగా ఉండటం కూడా వీరిలో సంతృప్తికి మరో కారణంగా ఉంటున్నాయి. ఎందుకంటే పురుషుల విషయంలో కెరీర్, సక్సెస్ అనేది తరచుగా వారి గుర్తింపు, ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రాథమిక అంశంగా మారుతోంది. అదే స్త్రీ విషయానికి వస్తే సోషల్ రోల్స్, మూస పద్ధతుల కారణంగా అసంతృప్తి పెరగుతోంది. దీంతోపాటు సహోద్యోగులు, క్లయింట్‌ల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, నిర్లక్ష్యం వంటివి కూడా మహిళల్లో పురుషులతో సమానమైన సంతృప్తిని చేరుకోవడానికి ఆటంకంగా ఉంటున్నాయి. ఇటువంటి ఆటంకాలేవీ లేనందున పురుషుల్లో వర్క్ ప్లేస్ సంతృప్తికి దోహదం చేస్తోంది.
Also Read... కిడ్నీలను దెబ్బతీస్తున్న హై బ్లడ్ ప్రెషర్.. జెనెటిక్ మ్యుటేషన్ లేకపోవడమే రీజన్