మీ భార్య సంతోషంగా ఉండటం లేదా.. అయితే భర్త ఈ పనులు చేయాల్సిందే!

by Jakkula Samataha |
మీ భార్య సంతోషంగా ఉండటం లేదా.. అయితే భర్త ఈ పనులు చేయాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు ముళ్ల బంధంతో రెండు మనుసులు, వేద మంత్రాల సాక్షిగా ఒకటవుతాయి. ఇక ఇద్దరూ ఒకరిగా బతుకుతూ.. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంటారు. ఇక ఈ మూడు ముళ్ల బంధం చాలా బలంగా ఉండాలి అంటారు.

ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది త్వరగా విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాల వలన వారి వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడి అవే విడాకులకు కారణం అవుతున్నాయి. అయితే ఎలాంటి కలతలు లేకుండా సంసార జీవితం బాగుండాలి అంటే భర్త తన భార్యను సంతోషంగా ఉంచాలి అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

ఈ చిన్న టిప్స్ పాటించడం వలన భార్య,భర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా వారి సంసార జీవితం హాయిగా సాగిపోతుందంట.

1. నిజాయితీ : భార్య భర్తలు ఇద్దరూ నిజాయితీగా ఉండాలంట. ఏ విషయాన్నైనా ఇద్దరూ పంచుకోవాలి. అలాంటి బంధంలో ఎలాంటి కలతలు రావంట.

2. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి : ఇద్దరూ ఎప్పుడూ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలంట. బంధువుల మధ్య ఇద్దరూ గౌరవంగా మాట్లాడుకోవాలంట.ముఖ్యంగా భర్త నా భార్య అని పెత్తనం చెలాయించకుండా.. నలుగురు ఉన్నకాడ, గౌరవంగా మాట్లాడాలంట.

3. బాధ్యత : జీవితం చాలా బాగుంటుందని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే తన భర్త తన తండ్రిలాగే తనను కాపాడాలని భార్య ఎప్పుడూ ఆశిస్తుంది. భర్త నుంచి సంరక్షణ కోరుకుంటుంది. భర్త అలా తన భార్యను ఓ తండ్రిలా చూసుకుంటే, ఆ బంధం బలంగాఉంటుందంట.

4. భార్య అనారోగ్యంలో తోడు : భర్త, భార్య అనారోగ్యంగా ఉంటే వెంటనే స్పందించాలంట. ఆరోజు ఆఫీసుకు వెళ్లకుండా, తన భార్యనే కంటికి రెప్పలా చూసుకోవాలంట. దాని వలన ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటమే కాకుండా భార్య సంతోషంగా ఉంటుందంట.

Advertisement

Next Story

Most Viewed