- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త సమాధిపై 'వ్యభిచారి' అని చెక్కించిన భార్య.. ఎందుకంటే?
దిశ, ఫీచర్స్ : కొలీగ్‌తో సెక్సువల్ రిలేషన్ పెట్టుకున్న భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి భార్య సరైన మార్గాన్ని ఎంచుకుంది. ఎఫైర్ కొనసాగిస్తున్న సహోద్యోగితో సెక్స్ చేస్తుండగా సదరు భర్త గుండెపోటుతో మరణించగా.. అతడి సమాధిపై 'వ్యభిచారి' అనే పదాన్ని చెక్కించింది భార్య. అయితే, తల్లి చర్యను సమర్థించిన కొడుకు ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని రెడిట్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
కెనడాకు చెందిన మహిళ కుమారుడు 'Am I The Asshole' రెడిట్ గ్రూప్‌లో విచిత్రమైన రివేంజ్ స్టోరీని పోస్ట్ చేశాడు. అంతేకాదు తల్లి చేసిన పనిని తాను సమర్థించడం న్యాయమేనా? అని ప్రశ్నించాడు. ఆఫీస్ కొలీగ్‌తో తన తండ్రి లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండటం వల్ల ఆమె గర్భందాల్చిందని.. దీంతో అల్లకల్లోలమైన వివాహబంధం నుంచి తప్పించుకునేందుకు ఆమెతో కలిసి కెనడాకు వలస వెళ్లేందుకు ప్రయత్నించాడని వివరించాడు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయి ఆమెతోనే నివసిస్తున్నట్లు తెలిపాడు.
అంతేకాదు తనతో సెక్స్ చేస్తుండగానే గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడని వెల్లడించాడు. ఇక తన తల్లితో విడాకులు తీసుకోకుండానే ఆమెతో కలిసి ఉంటుండగా ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఈ విషయంలో అత్యంత బాధను అనుభవిస్తున్న తల్లి.. తండ్రి సమాధిపై 'జాన్ డో(కొడుకు, భర్త, తండ్రి, వ్యభిచారి) ప్రేమపూర్వక జ్ఞాపకార్థం' అని చెక్కించింది అన్నాడు.
ఇక సమాధిపై ఇలాంటి ద్వేషపూరిత రాతల పట్ల తన తండ్రి కుటుంబంతో పాటు సహోద్యోగి కోపంగా ఉన్నప్పటికీ.. అది తన తండ్రి పాత్రను కచ్చితంగా ప్రతిబింబిస్తుందని అతను నమ్ముతున్నాడు. కాగా ఈ కథనం చదివిన చాలా మంది యూజర్లు.. ప్రశంసలు కురిపించారు. అయితే తన తండ్రిని ప్రేమించేవారు మాత్రం ఆ సమాధి అగౌరవంగా ఉందనుకుంటారని అతను విశ్వసించాడు.