- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్వరం నుంచి తక్షణ ఉపశమనానికి 5 చిట్కాలు!
దిశ, వెబ్‌డెస్క్: చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం.. ఏ సీజన్‌లోనైనా వచ్చే సాధారణ వ్యాధి జ్వరం. ఇది వాతావారణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడం వల్ల వస్తుంది. ఫీవర్ రాగానే ముందుగా ఎవ్వరికైనా గుర్తుకొచ్చేది హాస్పిటల్. కానీ కొన్నిసార్లు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో కొన్ని సులభమైన ఇంటి నివారణలను పాటిస్తే ఫీవర్ తగ్గిపోతుంది.
1. తడిబట్ట..
* సన్నని బట్టని గానీ, టవల్‌ను గానీ నీటిలో ముంచి నుదుటిపై ఉంచాలి.
* అధిక జ్వరం ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గేవరకు ఇలా తరచుగా చేయాలి.
2. అల్లం..
* జ్వరాన్ని తగ్గించే గుణం అల్లంకు ఉంటుంది.
* ఒక స్పూన్ అల్లంను వేడి నీటిలో మరిగించి ప్రతీ 3-4 గంటలకొకసారి తాగాలి.
* మనం తాగే టీలో కూడా అల్లంను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
3. ఆపిల్ సైడర్ వెనిగర్..
* ఈ ద్రావణంలో కాస్త నీళ్లు పోసి, ఇందులో ఓ క్లాత్‌ను ముంచి నుదురు, కడుపు భాగాలపై ఉంచితే జ్వరం నుంచి ఉపశమనం పొందచ్చు.
* ఇలా రోజుకు మూడు సార్లు చేయండి.
4. తులసి..
* తాజా తులసి ఆకులను ఉదయం పూట నమలండి.
* 6-7 తులసి ఆకులను నీటిలో మరిగించి, ఈ వాటర్‌ను ప్రతీ 3 నుంచి 4 గంటలకు ఒకసారి తీసుకోవడం వల్ల జ్వరం నుంచి బయటపడొచ్చు.
5 పసుపు..
* ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు పసుపులో ఉంటాయి.
* నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసి మరిగించి, ఆ గోరువెచ్చని నీళ్లను తాగితే ఫీవర్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
Read More: జర్నీలో తలనొప్పి, వికారం వేధిస్తున్నాయా?.. అయితే వీటిని తీసుకెళ్లండి!