- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి కొవిడ్-19ను తగ్గిస్తుందా?
దిశ, ఫీచర్స్: గంజాయి సమ్మేళనాలు COVID-19 సంక్రమణను నిరోధించగలవని యూఎస్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. కొవిడ్ నివారణకు గంజాయి కీలకమని పేర్కొంది. వైరస్‌ను మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే సమ్మేళనాలు ఈ మొక్కలో ఉన్నాయని వెల్లడించింది.
అధ్యయన ఫలితాలు..
జనపనారలో సాధారణంగా కనిపించే రెండు సమ్మేళనాలు 'కన్నబిజెరోలిక్ యాసిడ్ (CBGA)తో పాటు కన్నాబిడియోలిక్ యాసిడ్(CBDA)లో కరోనా వైరస్‌ను ఎదుర్కొగల సామర్థ్యం ఉన్నట్లు ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. కెమికల్ స్క్రీనింగ్ చేసినపుడు అవి వైరస్‌పై కనిపించే స్పైక్ ప్రోటీన్‌లకు కట్టుబడి ఉన్నాయని, వ్యాధికారకాలు ప్రజలను సోకే దశను నిరోధించగలిగాయని జర్నల్ ఆఫ్ నేచర్ ప్రొడక్ట్స్‌లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడించారు. ఫైబర్, ఆహారం, పశుగ్రాసానికి మూలమైన జనపనారను సాధారణంగా సౌందర్య సాధనాలు, బాడీ లోషన్స్, ఫుడ్ సప్లిమెంట్స్‌లో ఉపయోగిస్తారు. కాగా కొవిడ్-19 సంక్రమణ ద్వారా మానవ ఎపిథీలియల్ కణాలు ఇన్‌ఫెక్ట్ కాకుండా కన్నాబిజెరోలిక్ యాసిడ్, కన్నాబిడియోలిక్ యాసిడ్స్ నిరోధించాయని గత పరిశోధనల్లో స్పష్టమైంది.
స్మోకింగ్‌తో నో యూజ్..
అయితే గంజాయిని స్మోక్ చేయడం వల్ల కొవిడ్-19 నుంచి రక్షణ పొందలేరని పరిశోధకులు స్పష్టం చేశారు. వైరస్‌లోని ఆల్ఫా, బీటా వేరియంట్స్‌కు వ్యతిరేకంగా సమ్మేళనాల ప్రభావాన్ని ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ అధ్యయనంలో వ్యక్తులకు సప్లిమెంట్స్ అందించడం లేదా సమ్మేళనాలను ఉపయోగించేవారిలో గల ఇన్‌ఫెక్షన్ రేట్లను, లేనివారితో పోల్చడం వంటివి చేయలేదు. 'ఈ సమ్మేళనాలను మౌఖికంగా తీసుకోవచ్చు. మానవులలో సురక్షితమైన ఉపయోగానికి సంబంధించి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంటుంది' అని పరిశోధకుల్లో ఒకరైన బ్రీమెన్ చెప్పారు. SARS-CoV-2 ద్వారా సంక్రమణను నివారించడం, చికిత్స చేయగల సామర్థ్యం వాటికి ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయంలో స్థానిక వైద్యుడు లేదా ఆస్పత్రి నుంచి సలహాలు తప్పక తీసుకోవాలని ఆయన సూచించారు.
కొవిడ్ నివారణ వైద్య పద్ధతులకు సంబంధించిన పరిశోధనలో ఈ అధ్యయనం పురోగతి సాధించినప్పటికీ.. అనేక దేశాల్లో గంజాయి వాడకానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నందున భవిష్యత్తులో ఈ ఆవిష్కరణ ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయంలో స్పష్టత లేదు.