- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారాన్ని సైలెంట్‌గా చేసుకోండి.. శబ్ధాలు వినలేకపోతున్నాం!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంటి గుట్టు ఎవరికి తెలియకూడదని పెద్దలు అంటూ ఉంటారు. ఇంట్లో జరిగే గొడవలు, సరదాలు అన్ని నాలుగు గోడలమధ్య ఉంటేనే అందమని, అవి బయటికి పొక్కితే ఇంటిపరువు రోడ్డున పడుతుందని నమ్ముతారు. మరి చిన్నచిన్న గొడవలు, మాటలు పక్కింటివారికి వినిపిస్తే ఓకే .. కానీ పడకగదిలో భార్యతో శృంగారం చేసేటప్పుడు వచ్చే శబ్దాలు కూడా పక్కింటివారికి వినిపిస్తే.. ఛీఛీ ఎంత పరువు తక్కువగా ఉంటుంది కదా.. అర్ధరాత్రి ఆ శబ్దాలకు పక్కింటివారికి నిద్రాభంగం కలుగుతుంది. ఇక తాజాగా ఇలాంటి సమస్యను ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడట. తమ పక్కింటి నుండి వచ్చే శృంగారపు శబ్దాలకు ఆయన నిద్రకు భంగం కలిగిందట.. దీంతో ఆయన ఏకంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పొరిగింటి అతనికి లేఖ రాసి పంపాడు. ప్రస్తుతం ఆ లేఖ నెట్టింట వైరల్ గా మారింది.
స్టీఫెన్ కన్నింగమ్ అనే వ్యక్తి ఒక కాలనీ లో నివసిస్తున్నాడు. ఆ కాలనీలోని ఇంటి గోడలన్నీ చాలా పలుచగా ఉండడంతో పక్క ఇంటిలో గట్టిగా మాట్లాడితే ఈ ఇంటిలోకి వినిపిస్తాయి. ఈ విషయాన్ని స్టీఫెన్ కన్నింగమ్ తెలుసుకోలేకపోయాడు. అతను రోజు తన భార్యతో శృంగారం చేసేటప్పుడు గట్టిగా శబ్దాలు చేస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు తన ఇంటి డోర్ కింద ఒక లెటర్ ని చూశాడు. ఆ లెటర్ విప్పి చదవగానే ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే ” డియర్ నైబర్ .. ఒక ఫ్రెండ్లీ నైబర్ గా చెప్తున్నాను.. ఈ బిల్డింగ్ గోడలు చాలా పలుచగా ఉంటాయి.. కొంచెం శబ్దం చేసినా అది అందరికి వినిపిస్తుంది. మీరు రాత్రిపూట శృంగారంలో పాల్గొన్నప్పుడు వచ్చే శబ్దాలు సైతం మాకు వినిపిస్తున్నాయి. దయచేసి గమనించగలరు.. కనుక ఇకపై శృంగారంలో పాల్గొంటే సైలెంట్ గా కార్యక్రమం చేసుకోండి.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ లెటర్ చదివిన స్టీఫెన్ కి నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి. పేరు లేని ఆ లెటర్ ని స్టీఫెన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ లెటర్ కాస్తా వైరల్ గా మారింది. ఇక ఈ లెటర్ చదివిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.