- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుందాం : డోలి శర్మ
దిశ, పెద్దపల్లి : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తెలంగాణ ప్రజలందరూ తీర్చుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలి శర్మ అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామంలో కాంగ్రెస్ లో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీ స్కామిలీ గా మారిందని ఘాటుగా వ్యాఖ్యనించారు. టీఎస్పీఎస్సీ లో ఉద్యోగాలు అమ్ముకున్నారని, ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి తీరుతామన్నారు. యువతకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. యువత స్వయం వృద్ధి సాధించేందుకు కార్పొరేషన్ ల ద్వారా లోన్లు కూడా అందిస్తామని పేర్కొన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేయ్యాలని కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో ఎలిగేడు మండలానికి చెందిన బీఆర్ఎస్ బీజెపీ నాయకులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తంగళ్ళపల్లి రాయ బోసు, సుందరగిరి సంతోష్, సుందరగిరి అంజయ్య, సత్యనారాయణ,కంది రాజేశం, నరేష్,శ్రీనివాస్, ఓదెలు, తంగళ్ళపల్లి వెంకటేశం, కంది సందీప్, రాజమల్లు,వెంకటేశం, లక్ష్మణ్, నరేందర్, సాగర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దిలీప్, వెంకన్న, రాము జూలపల్లి మండలం, వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు పర్లపల్లి రవి, పుట్ట గంగయ్య పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామనికి చెందిన పెర్క నర్సయ్య, మల్లేష్, మధునయ్య,లక్ష్మయ్య, రాజయ్య, జోగు మల్లేష్, మల్యాల శ్రీనివాస్, జోగు శ్రీనివాస్, సల్మాన్, పల్లె అజయ్,లక్ష్మయ్య, మారయ్య, కనుకయ్య, యాదగిరి, రమేష్, స్వామి, రాజయ్య తో పాటు తదితరులు డోలి శర్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, సంతోష్ రావు రాజేశ్వర్ రెడ్డి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.