మూగ జీవలపై చిరుత దాడి

by Sumithra |
మూగ జీవలపై చిరుత దాడి
X

దిశ, కల్వకుర్తి: అమనగల్ మండలంలోని రాంనుంతల గ్రామానికి చెందిన గడిగే ఈదమయ్య, రామచంద్రయ్య అనే రైతులకు సంబంధించిన దూడలపై చిరుత పులి దాడి చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రాత్రి పొలాల్లో కట్టేసి ఉన్న లేగ దూడలపై రాత్రి సమయంలో చిరుత దాడి చేసినట్లు గుర్తించారు. తెల్లవారు జామున చూసేసరికి దూడలు మృతిచెంది కనిపించాయని, దూడ సగ భాగం చిరుతపులి తినేసిందని, గత 10 రోజుల కిందట కూడా చిరుత పులి దాడి చేసిందని వారు తెలిపారు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. దూడ మృతి పట్ల ఆర్థిక సహాయం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులు తెలియచేయగా సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని పంచనామా నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఆమనగల్, కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలోని పలు సమీప వ్యవసాయ పొలాల్లో చిరుత దాడుల్లో సుమారు 49 లేగా దూడలు మృతి చెందాయని, అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకోవడంలో విఫమయ్యారని రైతులు వాపోయారు.

Advertisement

Next Story

Most Viewed