లింగయ్య కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి

by Sridhar Babu |
Left party leaders
X

దిశ, ములకలపల్లి: ‘సడక్ బంద్‌’లో పాల్గొనేందుకు వస్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడిన పద్దం లింగయ్య(55) చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో విషయం తెలిసిన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎమ్ఎల్) నేత పోటు రంగారావులు భద్రాచలం ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. లింగయ్య మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు పోరులో మరణించిన గిరిజన రైతు లింగయ్య కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూం, ఐదెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎమ్ఎల్) నేత కెచ్చల రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, Sk సాబీర్ పాషా, కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story