రిలయన్స్ షోరూంలను టార్గెట్ చేసిన వామపక్షాలు

by Shyam |
రిలయన్స్ షోరూంలను టార్గెట్ చేసిన వామపక్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ సంస్థలను వామపక్షాలు టార్గెట్ చేశాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిందని మండిపడుతున్నాయి. ఢిల్లీలో 25 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న రైతులకు మద్దతుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్పొరేట్ కంపెనీ అయిన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ షోరూం ముందు వామపక్షాల నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా కార్పొరేట్ శక్తుల వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టేందుకు మోడీ అంగీకరించి, నూతన వ్యవసాయ చట్టాలు చేశారని, కార్పొరేట్ శక్తుల మూలంగా తమ భూముల్లోనే రైతులు వ్యవసాయ కూలీలుగా మారే ప్రమాదం ఉందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోట గోపి, సీపీఐ జిల్లా నాయకుడు దంతాల రాంబాబు మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని అణచి వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story