- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్ణణ ప్రగతి దరఖాస్తుల బుట్టదాఖలు..?
పట్టించుకోని పాలకులు, అధికారులు
దిశ, వరంగల్ :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం బాధితుల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులకు సమర్పిస్తున్న ఈ దరఖాస్తులు.. బుట్టదాఖలు అవుతున్నాయనే విమర్శలు అదే రీతిన వినిపిస్తున్నాయి. జిల్లాల్లోని ఆయా పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పర్యటిస్తున్న క్రమంలో వేలాదిగా దరఖాస్తులు అందాయి. పింఛన్ రావడం లేదని, పట్టా పాస్ పుస్తకం ఇవ్వడం లేదని, రైతుబంధు డబ్బులు బ్యాంకులో జమ కాలేదని, ఇలా అనేక రాతపూర్వకమైన వినతులను బాధితులు అందజేశారు. అయితే ప్రజా ప్రతినిధులు, అధికారులు కేవలం హంగూ ఆర్భాటాల కోసమే వార్డుల్లో పర్యటిస్తున్నారు తప్ప, సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు.
ప్రగతి ఎక్కడ..?
పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అనుకున్న మేరకు లక్ష్యాన్ని సాధించాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా హరితహారం కార్య్రకమాన్ని ప్రజా ప్రతినిధులు తూతూ మంత్రంగా నిర్వహించారనే వాదనలు లేకపోలేదు. చాలా చోట్ల మొక్కలు నాటినప్పటికీ వాటి సంరక్షణను గాలికొదిలేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలున్నాయి. అదే విధంగా ఫ్లెక్సీల వాడకాన్ని సైతం పూర్తిగా తగ్గించాలనే స్వయంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సెలవిచ్చారు. ఇటీవల సీఎం కేసీఆర్ తన బర్త్‌డే వేడుకల సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లాంటి మహానగరంలోనే ఆదేశాలను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. జిల్లాలకు వచ్చే సరికి ఆ నిబంధనలు అంతగా అమలు కావడం లేదు. ఏ ప్రధాన కూడలిలో చూసినా ప్రజా ప్రతినిధులు, నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. డ్రెయినేజీ సిస్టమ్ సక్రమంగా లేదు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మించడం వల్ల మురికినీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. సరిపడా చెత్త ఎత్తే వాహనాలు లేవు. దీంతో ఇండ్లు, దుకాణాల సముదాయాల్లో చెత్త పేరుకుపోతోంది.
హన్మకొండ నగరంలోని ప్రధాన చౌరస్తాలో పార్కింగ్ ప్రదేశం లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో దుకాణ సముదాయాల ముందు పార్క్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లఘించారంటూ అడ్డగోలుగా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.
tags : Greater warangal, Written Applications, Roads, Drainage, Traffic