- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాంకర్ రవి కోసం అన్నపూర్ణ స్టూడియో వద్ద ధర్నా.. తెలంగాణ జాగృతి క్లారిటీ
దిశ, ఎల్బీనగర్: ‘బిగ్‌బాస్ షో’ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ రవి కోసం జరిగిన ధర్నాకు తెలంగాణ జాగృతికి ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాము యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మలక్‌పేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఆదివారం జరిగిన ధర్నాలో తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ నవీన్ గౌడ్ పాల్గొని చేసిన ధర్నాకు, తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖ నుండి ఎటువంటి అధికారిక అనుమతి లేదన్నారు.
నవీన్ ధర్నా చేస్తున్నట్లు కనీసం తెలంగాణ రాష్ట్ర శాఖకు ఎలాంటి సమాచారం కూడా అందించలేదని వెల్లడించారు. అది పూర్తిగా అతని వ్యక్తిగతమైన విషయం అన్నారు. అయినప్పటికీ తెలంగాణ జాగృతి పేరును కొన్ని ప్రసార మాధ్యమాల్లో పేర్కొన్నారని తెలిపారు. ఈ విషయంపై జాగృతి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కూడా తెలియచేశామన్నారు. రాష్ట్రశాఖ అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటుందని తెలియచేశారని తెలిపారు. అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ జాగృతికి, అధ్యక్షురాలు కవితకు అపకీర్తి తీసుకొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.