కింగ్ ను ఫాలో అయిపోతా: లావణ్య

by Shyam |
కింగ్ ను ఫాలో అయిపోతా: లావణ్య
X

అందాల భామ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం బిజీగా ఉంది. అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్న హీరోయిన్… తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసిందట. A1 ఎక్స్ప్రెస్ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్న లావణ్య… పాత్రల ఎంపిక గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

అందాల రాక్షసి సినిమాతో కెరియర్ లో దూసుకుపోతుంది అనుకున్న లావణ్య… అంచనాలను అందుకోలేక పోయింది. కానీ నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని అయిష్టంగానే ఒప్పుకుందట లావణ్య. నాగార్జున లాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తే … అలాంటి ఛాన్స్ లే వస్తాయని తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతావని హెచ్చరించారట. దీంతో భయపడిన అందాల రాక్షసి మనసొప్పక పోయినా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇదే విషయాన్ని నాగ్ కు చెప్తే అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దని చెప్పారట. తర్వాత ఆ సినిమా హిట్ కావడం… అందులో లావణ్య కనిపించిన తీరుకి ప్రశంసలు పొందడం జరిగాయి. దీంతో అప్పటి నుంచి నాగార్జున తన మెంటర్ గా మారిపోయాడని చెప్తోంది. ఒక ప్రాజెక్ట్ కు సైన్ చేసే ముందు నాగార్జున సలహాలు తీసుకుంటానని తెలిపింది.

Tags: Lavanya Tripathi, Nagarjuna, Tollywood, Arjun Suravaram, A1 Express

Advertisement

Next Story