వారెవ్వా.. ఎలక్ట్రిక్ చాక్లెట్ కారు.. వీడియోకు నెటిజన్లు ఫిదా..!

by Shiva |
వారెవ్వా.. ఎలక్ట్రిక్ చాక్లెట్ కారు.. వీడియోకు నెటిజన్లు ఫిదా..!
X

దిశ, వెబ్ డెస్క్: కొంచెం టాలెంట్ ఉంటే చాలు ఏకంగా భూగోళాన్నే షేక్ చేయవచ్చని నిరూపించాడు తాజాగా ఓ చెఫ్. తన టాలెంట్ తో ఎలక్ట్రిక్ చాక్లెట్ కారును తయారు చేశాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరలైంది. అతని టాలెంట్ కు నెటిజన్లు అంతా ఫిదా అయిపోయారు. వీడియోతో పాటు, 'చాక్లెట్ తో ఎలక్ట్రిక్ కారను హ్యాండ్‌క్రాఫ్ట్ చేయడం అంత సులభం కాదు' అని ఆయన క్యాప్షన్ లో తెలిపాడు.-

వీడియోలో, అతను మొదటి నుంచి చాక్లెట్ ఎలక్ట్రిక్ కారును ఎలా తయారు చేశాడో చూపించాడు. ఎలక్ట్రిక్ కారు తయారీలో చెఫ్ అనేక రకాల సాంకేతికతలను, చాక్లెట్ రకాలను ఉపయోగించారు. కేక్ మీద ఐసింగ్ కూడా చేశాడు. కాగా.. అతని వీడియోకి నెటిజన్లు మాత్రమే కాదు.. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హ్యూందాయ్ కూడా స్పందించింది. ఈ కారు కింద కామెంట్ గా.. ఇది ఒక స్వీట్ రైడ్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. అదేవిధంగా నెటిజన్లు మాత్రం ఆ చెఫ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతను పడిన కష్టాన్ని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Next Story

Most Viewed