‘కేదార్‌నాథ్’ వెళ్లాలనుకునే భక్తులకు సూపర్ న్యూస్

by GSrikanth |
‘కేదార్‌నాథ్’ వెళ్లాలనుకునే భక్తులకు సూపర్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కేధర్‌నాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే, హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలపై వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా ఉంటుంది. ఇక, ఈ ఏడాది భక్తుల సందర్శనార్థం ఏప్రిల్‌ 25 నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నట్లు సమాచారం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు కూడా వస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పటికే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హెలికాప్టర్‌ సర్వీసులను ప్రారంభించింది.

ఏటా ఉత్తరాఖండ్‌ ‘సివిల్‌ ఏవియేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (UCADA)’ ఈ సేవలను నిర్వహించే హెలికాప్టర్‌ సంస్థలను నుంచి టెండర్లను ఆహ్వానిస్తుంది. ఈసారి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్‌ను https://heliyatra.irctc.co.in/ ప్రారంభించింది. ఇప్పటికే ట్రయల్‌ రన్స్‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌ చేరానులకునే వారు ముందుగా ఉత్తరాఖండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌, టూరిస్ట్ కేర్‌ ఉత్తరఖండ్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. +91 8394833833 మొబైల్‌ నెంబర్‌కు ‘Yatra’ అని వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Next Story