- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. వ్యక్తిగత దూషణలు సరికాదు’
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ సిబ్బంది విధుల్లో చేరే సమయంలోనే నిజాయితీతో, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారని, ఏ కేసులోనూ ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేసులో ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టుల్లో తేల్చుకోవాలే తప్పా చట్టబద్దం కాని ప్రమాణాలు చేయమని కోరటం అసంబద్దమన్నారు.
సీపీ రంగనాథ్పనితీరు ఇంతకుముందు ఆయన విధులు నిర్వర్తించిన ఖమ్మం, నల్గొండ జిల్లాల సామాన్య జనాన్ని అడిగినా తెలుస్తుందని, బీజేపీ కార్యకర్తలను అడిగినా చెప్తారని హితవు పలికారు. పోలీసు అధికారులు, సిబ్బంది విశ్వసనీయతను ప్రశ్నించే వైఖరిని మార్చుకోవాలని సూచించారు. దర్యాప్తు అధికారులు అన్ని వివరాలను కోర్టుకు అందజేస్తారని, ఏవైనా సందేహాలు ఉంటే బండి సంజయ్నివృత్తి చేసుకోవచ్చన్నారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చిన కేసులో సంజయ్ అరెస్టయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సీపీపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘మూడు సింహాలపై చేయి పెట్టి ఈ కేసులో నా పాత్ర ఉందని ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిని పోలీసు అధికారుల సంఘం ఖండించింది.