- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మ. 2 గంటల వరకే షాపులు ఓపెన్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని వ్యాపార సంస్థలవారు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలమూరులో కరోనా వ్యాప్తి చెందుతున్న అన్ని వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారం చేయాలని తీర్మానించారు. పాలమూరు పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీ మీ పనులు మధ్యాహ్నం 2 గంటలలోపే పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి దుకాణదారుడు మీ వంతు బాధ్యతగా కరోనా నియమాలను పాటిస్తూ, 2 గంటల వరకు వ్యాపారాలను ముగించుకొని ప్రజలతోపాటు మన ప్రాణాలను కాపాడుకుందాం అని పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశంలో స్టీల్ అండ్ సిమెంట్ అధ్యక్షులు చేరుకుపల్లి రాజేశ్వర్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షలు ఎదిరే ప్రమోద్ కుమార్, కిరాణం అసోసియేషన్ అధ్యక్షులు సంబు లక్ష్మణ్, ఏజెన్సీ అధ్యక్షులు చక్రధర్, మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్, గోల్డ్ షాప్ అధ్యక్షులు ప్రకాశ్, గోల్డ్స్మిత్ అధ్యక్షులు రాము, క్లాత్ మార్చేంట్ ప్రధాన కార్యదర్శి సీమ నరేందర్, రైస్ మిల్లర్ అధ్యక్షులు గుబ్బ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.