చిత్రపురి కాలనీలో రెడ్డిగారి విగ్రహావిష్కరణ

by Sujitha Rachapalli |
చిత్రపురి కాలనీలో రెడ్డిగారి విగ్రహావిష్కరణ
X

దిశ, సినిమా : చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో ప్రముఖ నటులు, స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రభాకర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని, ఆయన వల్లే ప్రస్తుతం నాలుగున్నర వేల కుటుంబాలకు నివాస సౌకర్యం ఏర్పడిందని సినీ ప్రముఖులు అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌ మాట్లాడుతూ.. చిత్రపురిలో మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత, ఇక్కడే ఎత్తయిన స్థలంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యేందుకు ఎక్కువ కృషి చేసింది ప్రభాకర్ రెడ్డి గారే. ఎప్పుడూ కార్మికుల సంక్షేమం గురించే ఆలోచించేవారని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ కార్మికుల బాగు కోసం ప్రభాకర్ రెడ్డితో పాటు దాసరి నారాయణరావు కూడా చాలా కృషి చేశారని గుర్తుచేశారు. చిత్రపురి కాలనీలో వాళ్లిద్దరి విగ్రహాలు పెట్టాలని కోరారు. అంతేకాదు ఆ విగ్రహాలను తానే డొనేట్ చేస్తానని తెలిపారు.

Advertisement

Next Story