ఈ గంటలో సంఘటనలు.. సంక్షిప్తంగా..

by srinivas |   ( Updated:2020-03-09 06:56:39.0  )
ఈ గంటలో సంఘటనలు.. సంక్షిప్తంగా..
X

కరోనా దెబ్బకు మర్కెట్ల పతనం

ఈ ఏడాది హోలీ రోజున మార్కెట్లకు రంగు పడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1941.67 పాయింట్ల నష్టంతో 35,634 వద్ద క్లోజయింది. నిఫ్టీ 538 పాయింట్లను కోల్పోయి 10,451 వద్ద ముగిసింది. లంచ్ సమయంలో మార్కెట్లు రికార్డు స్థాయిలో 2400 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. మార్కెట్లు ఆ స్థాయిలో పతనమవడం చూసి పెట్టుబడిదారులు భయంతో వణికిపోయారు. ఒకవైపు ప్రపంచ మార్కెట్లు, ఆసియా మార్కెట్ల పతనం, మరోవైపు దేశీయంగా మాంద్యం మొదలుకొని యెస్ బ్యాంక్ సంక్షోభం వరకూ అన్ని రకాలుగా కుదేలవడంతో మార్కెట్లు భారీ పతనాన్ని చూడవలసి వచ్చింది.

నిర్మల్‌లో కరోనా అనుమానిత కేసు

నిర్మల్ జిల్లాలో కోవిడ్-19(కరోనా) మరో అనుమానిత కేసు నమోదైంది. మామడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇతను వారం కిందట గల్ఫ్ నుంచి నిర్మల్‌కు వచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు.

షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్‌

ఆరు నూరైనా ఐపీఎల్‌ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న విషయం వాస్తవమే. కానీ, ఎట్టిపరిస్థితుల్లో ఐపీఎల్ వాయిదా వేయబోమని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్‌లు జరిగే అన్ని ప్రాంతాల్లో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని గంగూలీ హామీ ఇచ్చారు.

రాహుల్‌కు ప్రకాశ్‌రాజ్ మద్దతు

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు మద్దతిస్తున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. పబ్‌ గొడవ ఘటనపై రాహుల్‌తో చర్చించిన ప్రకాశ్ రాజ్… తర్వాత అతన్ని తీసుకొని అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన…. ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.

స్థానిక సంస్థలకు ఏర్పాట్లు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే 13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ.. ఉత్వర్వులు జారీ చేసింది.
13 జిల్లాలకు నియమించిన అధికారులకు అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులు అయినా.. సిహెచ్. శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డిలను రిజర్వులో ఉంచింది.

కరోనా స్ర్కీనింగ్ కేంద్రాలపై ఈటల ఆరా

కరోనా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మో స్ర్కీనింగ్‌ సెంటర్లపై మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్న విధానంపై ఆయన అక్కడి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

అమ్మా అమృత.. ఆస్తి కోసమేనా ఇదంతా?

మారుతీరావు ఆత్మహత్య అనంతరం అమృతకు, ఆమె బాబాయ్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన తండ్రి చనిపోవడానికి కారణం బాబాయ్‌తో ఉన్న ఆస్తి తగాదాలే అని అమృత వెల్లడించింది. దీనిపై మీడియా శ్రవణ్‌ను ప్రశ్నించిగా స్పందించిన ఆయన ప్రణయ్‌ హత్య తర్వాత.. తన అన్నయ్య ఆత్మహత్య చేసుకునే వ‌ర‌కు ఉరితీయాల‌ని డిమాండ్ చేసిన అమృత ఒక్క‌సారిగా తన తల్లి గిరిజపై ప్రేమ ఒల‌క‌బోయడం హాస్య‌ాస్ప‌దంగా ఉందన్నారు. ఆయన సంపాదించిన ఆస్తిపై ప్రేమ పుట్టి డబ్బు కోసం డ్రామాలు మొద‌లు పెట్టింద‌న్నారు.

‘డొక్కా వైఎస్సార్సీపీలో అయినా కొనసాగాలి’

టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్సీపీలో అయినా దీర్ఘకాలం కొనసాగాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆకాంక్షించారు. బహిరంగ లేఖలో డొక్కా అవాస్తవాలు వెల్లడించారని అన్నారు. శాసనమండలికి కీలక సమయంలో గైర్హాజరయ్యారని, అలా జరగడం వల్లే ఆయన వైఎస్సార్సీపీలోకి మళ్లారన్న విషయం అర్థమైందని తెలిపారు.

Tags: last one hour issues, share market, ipl, corona case, etela, amrita, rahul

Advertisement

Next Story

Most Viewed