శిలాఫలకంలో ప్రోటోకాల్ ఉల్లంఘన!

by Aamani |
శిలాఫలకంలో ప్రోటోకాల్ ఉల్లంఘన!
X

దిశ, తాండూరు : నూతనంగా నిర్మించిన డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం విమర్శలకు దారి తీస్తోంది. యాలాల మండలం లక్ష్మీ నారాయణ పూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవ ప్రోటోకాల్ శిలా పలకలపై వైస్ చైర్మన్ ల పేర్లును ముద్రించకపోవడం నాయకులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు అధికారులు పేర్లను స్టిక్కర్లతో ముదిరించి శిలాఫలకంపై ఆట్టించటంతో వివాదం సద్దుమణిగింది.

వివరాలకు వెళ్తే.. యాలల మండలం లక్ష్మీ నారాయణ పూర్ లో కొత్తగా తీసేది బ్యాంకును ఏర్పాటు చేశారు ఈ బ్యాంకు బుధవారం ప్రారంభోత్సవం ను డీసీసీబీ జిల్లా చైర్మన్ కుల సత్తయ్య, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో ప్రారంభం చేయవలసి ఉండగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో బ్యాంకు చైర్మన్లు, డైరెక్టర్ల పేరు ముదిరించిన బ్యాంక్ అధికారులు కొందరి పేర్లు మర్చిపోయారు ముఖ్యంగా నవాంద్గి సహకార సంఘం వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, యాలల్ సహకార సంఘం వైస్ చైర్మన్ రాములు పేర్లు ముద్రించలేరు దీంతో రాములు అధికారులపై మండిపడ్డారు.

డైరెక్టర్లు చైర్మన్ ల పేర్లు నమోదు చేసి మా పేర్లు గుర్తుకు రాలేదా అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి వారి పేర్లను స్టిక్కర్ వేయించి అదే శిలాకరకంపై అంటించారు దీంతో కొంత వివాదం సద్దుమణిగింది .మరోవైపు అగ్గనూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యాంకుకు పేరు లక్ష్మీనారాయణ అపూర్ ఉండకుండా అగ్గనూర్ గ్రామ పేరు ఉండాలని యువకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఓచర్లో ముద్రించే విద్ధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ యువకులు కూడా శాంతించారు.

డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవానికి మహేందర్ రెడ్డికి కనీస సమాచారం లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి డీసీసీబీ బ్యాంక్ ప్రారంభోత్సవానికి అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మహేందర్ రెడ్డి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని తాండూరు ప్రజలు గమనిస్తున్నారని ఆయన వర్గీయులు కొందరు వ్యాఖ్యానించారు. మహేందర్ రెడ్డి కి అప్పగించిన బాధ్యతల్ని తాను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆయన వర్గీయులు అసంతృప్తితో స్పష్టం చేశారు.



Next Story

Most Viewed