తెలంగాణపై 'గులాబ్‌' ప్రభావం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

by Sridhar Babu |
తెలంగాణపై గులాబ్‌ ప్రభావం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
X

దిశ,పాలేరు: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగానే తన ప్రభావాన్ని చూపిస్తోంది. అటు రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కూసుమంచి పోలీసు శాఖ వారు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నదీప్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించిందని,తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

ప్రప్రథమంగా మత్స్యకారులు ఈ రెండు రోజులు పాలేరు చెరువులో, అటు వాగులు వంకల్లో చేపల వేటకు వెళ్లవద్దని కోరారు. మండలంలోని ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా రైతులు తమ పొలాల్లో విద్యుత్ మోటార్లను తాకవద్దని,వాగులు చెరువులు పొంగుతాయి కాబట్టి అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని సూచించారు. ఎవరైనా వరదల్లో చిక్కుకున్నా, ఏదైనా ప్రమాదానికి గురి అయినట్లయితే డైల్ 100 కి ఫోన్ చేయాలన్నారు. లేదా ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరని తెలిపారు.

కె.సతీష్( సిఐ): సెల్..9440904879

వై.నదీప్(ఎస్సై)సబ్ ఇన్స్పెక్టర్: సెల్..9440904884

Advertisement

Next Story