- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీ వల్లే నన్ను వేధిస్తున్నారు.. ఎందుకిలా చేశావ్? నటికి నెటిజన్ ట్వీట్
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌కు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన ‘మిమీ’ చిత్రంలోని ‘పరం సుందరి’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అతని పూర్తి పేరు ‘పరం ఛాయ’ కాగా.. ‘పరం’ తన ఇంటి పేరని, ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఫ్రెండ్స్ తనతో ఆడుకుంటున్నారని తెలుపుతూ కృతిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
‘చిన్నప్పుడు స్కూల్‌లో కూడా ఏదీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా ఇంటి పేరు, నా పేరును ఆటపట్టించిన వారిపై నాకెప్పుడూ కోపం రాలేదు. కానీ కృతి సనన్ ‘పరం సుందరి’ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 1000 సార్లు వేధించబడ్డాను. ఎందుకిలా చేశావు కృతి? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు?’ అంటూ ఫన్నీగా స్పందించాడు. ఇక అతడి ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన కృతి.. ‘అయ్యో సారీ’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. కాగా రెహమాన్ సంగీత సారథ్యంలో శ్రేయా ఘోషల్ ఆలపించిన ‘పరం సుందరి’ పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.
🤣🤣🤣🤣oops!! Sorry! 🙊🙊
— Kriti Sanon (@kritisanon) November 26, 2021