- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిస్మస్ రోజు వారికి 5 లక్షలు అందిస్తా.. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
దిశ, పరిగి: విశ్వవ్యాప్త పండుగ అయిన క్రిస్మస్‌కు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని క్రైస్తవులకు పరిగి బృందావన్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కానుకలను ( దుస్తులు ) ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు దుస్తులు ఇచ్చి క్రిస్మస్ పండుగకు ప్రాధాన్యతన ఇచ్చారన్నారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని చర్చిలను ప్రాధాన్యత ప్రకారం అభివృద్ధి చేస్తానన్నారు. పరిగిలో చర్చి అభివృద్ధికి 5 లక్షల రూపాయలు క్రిస్మస్ పండుగ రోజు ఇస్తానని హామీ ఇచ్చారు. పరిగి మున్సిపాలిటిలో క్రైస్తవులకు శ్మశాన వాటిక స్థలం లేదని దానికి స్థలం కేటాయించాలని క్రైస్తవులు అడిగారు. ఇందుకు స్పందించిన కొప్పుల మహేష్ రెడ్డి క్రైస్తవులకు శ్మశాన వాటిక స్థలంతో పాటు కాంపౌండ్ వాల్ కూడా కట్టి ఇస్తామని తెలియజేశారు.
అనంతరం పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతేగాని సురేందర్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్‌కు నాలుగు రోజుల ముందుగానే క్రైస్తవులందరికీ దుస్తులు పంపిణీ చేస్తున్నారంటే అది వారి అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కరణం అరవింద్ రావ్, సత్యమ్మ, అనుసూయ, మల్లేశం, జెడ్పీటీసీలు బేత హరిప్రియ, మేఘమాల, రాందాస్ పీఎసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఆఐ. వెంకట్ రామ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు.