- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుప్పకూలిన కొండపోచమ్మ బ్రిడ్జ్

X
దిశ ప్రతినిధి, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరోమారు అపశృతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని మర్కూక్ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ లో ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. గత మూడు నెలల క్రితం ఆగమేఘాల మీద సీఎం కేసీఆర్ స్వహస్తాలతో రిజర్వాయర్‌ను ప్రారంభించారు. గతంలో కొండపోచమ్మ సాగర్ కాలువ కట్టలు తెగి సమీప గ్రామాలు, పంట పొలాలను ముంచెత్తాయి. ఈ ఘటన జరిగి నెలరోజులు కూడా గడవక ముందే తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది. సంగారెడ్డి కెనాల్‌కు నీటిని వదిలే రెగ్యులేటర్ వాకోవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది. దీంతో శనివారం కొండపొచమ్మ రిజర్వాయర్ వద్ద భారీ క్రేన్లతో బ్రిడ్జి శిథిలాలను తొలగించడమే కాకుండా అత్యవసర మరమ్మత్తు పనులను అధికారులు ప్రారంభించారు.
Next Story