అడవి దున్న పిల్లకు కొమురం భీమ్ పేరు.. తీవ్ర అభ్యంతరాలు..

by Shyam |
అడవి దున్న పిల్లకు కొమురం భీమ్ పేరు.. తీవ్ర అభ్యంతరాలు..
X

దిశ, చార్మినార్ : నెహ్రూ జూలాజికల్ పార్కులో ఇటీవల జన్మించిన అడవి దున్న పిల్లకు కొమురం భీమ్ పేరును నామకరణం చేశారు జూ ఉన్నతాధికారులు. కొమురం భీమ్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు జూ ఉన్నతాధికారులు కొమురం భీమ్‌ పేరును ఉపసంహరించినట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటన లో తెలిపారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జూ పార్కులో అడవి దున్న పిల్ల జన్మిచ్చింది. జూన్ 5 రాష్ట్ర పర్యాటక దినోత్సవం రోజున జూ ఉన్నతాధికారులు కొమురం భీమ్ అని నామకరణం చేసిన విషయం విధితమే.. దీంతో కొమురం భీమ్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు కొమురం భీమ్ నామకరణం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అడవి దున్న పిల్ల కు పెట్టిన కొమురం భీమ్ పేరును తొలగించారు. గిరిజనుల హక్కుల సాధన కోసం ప్రాణాలర్పించిన కొమురం భీమ్ పై ఉన్న గౌరవంతోనే అడవి దున్న పిల్లకు ఆ నామకరణం చేశామన్నారు. అంతేకాకుండా తెలంగాణ అడవుల్లో ఎక్కువగా జీవించే అడవి దున్న కూడా ఎంతో చురుకైన, అత్యంత బలమైన జంతువని అందుకే ఆ మహానుభావుని పేరును వాడినట్లు పేర్కొన్నారు. నామకరణాన్ని ఉపసంహరించిన నేపథ్యంలో ఇంకా ఏ పేరు పెట్టాలో నిర్ణయం తీసుకోలేదని అందరూ ఇష్ట పడేలా మరో పేరు ను అతి త్వరలో పెడుతామని జూ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story