బాక్సింగ్ రింగ్‌లో ఆర్య..

by Shyam |
బాక్సింగ్ రింగ్‌లో ఆర్య..
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరో ఆర్య 30వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది. పా రంజిత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసింది మూవీ యూనిట్. ‘సర్పట్ట పరంబరై’గా టైటిల్ అనౌన్స్ చేసిన టీమ్.. బాక్సర్‌గా ఆర్య లుక్ కూడా రిలీజ్ చేసింది. ఫిట్ యాక్టర్ బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థితో పోటీపడుతుండగా.. ఆడియన్స్ చీర్స్ చెప్తున్న లుక్ అమేజింగ్‌గా ఉంది. ‘మనకు అవకాశాలు తేలికగా లభించవు. ఇది మన ఆట. ప్రత్యర్థులతో ఆడుకో.. లే కబీలా’ అంటూ ఫస్ట్ లుక్ షేర్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సినిమాలో ఆర్య క్యారెక్టర్ పేరు కబీలా అని ఇండైరెక్ట్‌గా చెప్పారు.

కాగా ఈ సినిమా కోసం కంప్లీట్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసిన ఆర్య.. ఫిట్‌నెస్, బాడీ గెయిన్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండగా, ఆర్య బాక్సర్‌ బాడీ లుక్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. పా రంజిత్, ఆర్య కాంబినేషనల్‌లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కాగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కె9 స్టూడియోస్‌పై షణ్ముగం దక్షణ్‌రాజ్ ‘సర్పట్ట పరంబరై’ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Next Story