కోల్‌కతాను గెలిపించిన కృష్ణుడు

by Anukaran |   ( Updated:2020-10-10 08:56:29.0  )
కోల్‌కతాను గెలిపించిన కృష్ణుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 24వ మ్యాచ్‌ ఉత్కంఠ పోరులో కోల్‌కతా అనూహ్య ఘన విజయం సాధించింది. కింగ్స్ ‌ఎలెవన్ పంజాబ్ పై కోల్‌కతా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఓవర్లలో పరుగులు సమర్పించిన కోల్‌కతా బౌలర్లు.. డెత్ ఓవర్లలో చుక్కలు చూపించారు. దీంతో పంజాబ్‌ 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కేకేఆర్‌కు వరమిచ్చిన కృష్ణ:

ముఖ్యంగా యువ బౌలర్ ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు తీసి పంజాబ్‌ను బెంబేలెత్తించాడు. క్రీజులో కుదురుకున్న మయాంక్ అగర్వాల్‌(56)ను క్యాచ్ అవుట్ రూపంలో పెవిలియన్ పంపాడు. ఈ వికెట్‌తోనే పంజాబ్ పతనం లాంఛనమైంది. ఆ తర్వాత సెంచరీ వైపు దూసుకెళ్తున్న కేఎల్ రాహుల్ (74)ను క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆశల పై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో పంజాబ్ చేతికొచ్చిన మ్యాచ్‌ను జార విడసింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్:

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి ఓవర్ నుంచి సమిష్ఠిగా రాణించి జట్టును గట్టున పెట్టారు. కానీ, డెత్ ఓవర్ సమీపంలో మయాంక్(56) పరుగులు చేసి 115 స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్ మయాంక్ వికెట్‌తో బ్యాటింగ్ కాస్త స్లో చేశాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ (16) పరుగులకే పెవిలియన్ చేరి మ్యాచ్‌ను ఉత్కంఠంలోకి నెట్టాడు. ఇక మిడిలార్డర్ సిమ్రాన్ సింగ్ సైతం (4)లకే క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో నిరుత్సాహానికి గురైన కేఎల్ రాహుల్ ఒత్తిడిలో షాట్ ఆడబోయి క్లీన్ బోల్డ్ అయ్యాడు. రాహుల్‌ పెవిలియన్ చేరడంతో 151 పరుగల వద్ద పంజాబ్ 4 నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఇంతటి క్లిష్ట సమయంలో క్రీజులో మ్యాక్స్‌వెల్, మందీప్ ఉన్నారు. చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సి ఉంది.. అది కాస్త చివరి రెండు బంతులకు 7కు చేరింది. ఇక భారీ సిక్స్‌కు ట్రై చేసిన మందీప్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చివరి బంతికి 7 పరుగులు చేసే ప్రయత్నంలో మ్యాక్స్‌వెల్ భారీ షాట్ కొట్టాడు. కానీ, ఇంచ్ గ్యాప్‌లో సిక్స్‌ మిస్ అయిపోయింది. నిర్ధిష్ఠ ఓవర్లలో పంజాబ్ 162 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే కోల్‌కతా కేవలం 2 పరుగుల తేడాతో గెలుపొందింది.

కోల్‌కతా ఇన్నింగ్స్:

తొలి ఇన్సింగ్స్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ పర్వాలేదనిపించారు. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి (4), నితీష్ రానా (2) పరుగులకే పెవిలియన్ చేరినా.. శుభ్‌మన్ గిల్ (57), దినేష్ కార్తీక్(58) పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇయాన్ మోర్గాన్ బాల్ బాల్ ఆడి 24 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. మిడిలార్డర్‌లో వచ్చిన ఆండ్రూ రస్సెల్(5) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా నైట్ రైడర్స్ 164/6 స్కోర్ చేయగలిగింది.

స్కోరు బోర్డు:

Kolkata Knight Riders Innings:
1.రాహుల్ త్రిపాఠి b షమి 4(10)
2.శు‌బ్‌మన్ గిల్ రనౌట్ (మందీప్/సిమ్రాన్ సింగ్)57(47)
3.నితీష్ రానా రనౌట్ (షమి/పూరన్)2(4)
4.ఇయాన్ మోర్గన్ c మ్యాక్స్‌వెల్ b రవి భిష్ణోయ్ 24(23)
5.దినేష్ కార్తీక్ (c) (wk) రనౌట్ (పూరన్/సిమ్రాన్ సింగ్)58(29)
6.ఆండ్రూ రస్సెల్ c సిమ్రాన్ సింగ్ b అర్ష్‌దీప్5(3)
7.ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్ 5(4)

ఎక్స్‌ట్రాలు:9

మొత్తం స్కోరు: 164/6

వికెట్ల పతనం: 12-1 (రాహుల్ త్రిపాఠి, 2.4), 14-2 (నితీష్ రానా, 3.3), 63-3 (ఇయాన్ మోర్గాన్, 10.4)145-4 (శుబ్‌మన్ గిల్, 17.5), 150-5 (ఆండ్రూ రస్సెల్, 18.2), 164-6 (దినేష్ కార్తీక్, 20)

బౌలింగ్:

మహ్మద్ షమి 4-0-30-1
అర్ష్‌దీప్ సింగ్ 4-1-25-1
క్రిస్ జోర్డాన్ 4-0-37-0
ముజీబ్ ఉర్ రహమాన్ 4-0-44-0
రవి భిష్ణోయ్ 4-0-25-1

Kings XI Punjab Innings:
1. కేఎల్ రాహుల్ (c) b ప్రసీద్ కృష్ణ 74(58)
2. మయాంక్ అగర్వాల్ c శుబ్‌మన్ గిల్ b ప్రసీద్ కృష్ణ 56(39)
3. నికోలస్ పూరన్ b నరైన్ 16(10)
4. సిమ్రాన్ సింగ్ (wk) c నితీష్ రానా b ప్రసీద్ కృష్ణ 4(7)
5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాటౌట్ 10(5)
6.మందీప్ సింగ్ c (sub)క్రిస్ గ్రీన్ b నరైన్ 0(1)
7. క్రిస్ జోర్డాన్ నాటౌట్ 0(0)

ఎక్స్‌ట్రాలు: 2

మొత్తం స్కోరు: 162/5

వికెట్ల పతనం: 115-1 (మయాంక్ అగర్వాల్, 14.2), 144-2 (నికోలస్ పూరన్, 17.2), 149-3 (సిమ్రాన్ సింగ్, 18.4), 151-4 (కేఎల్ రాహుల్, 18.6), 158-5 (మందీప్ సింగ్, 19.5).

బౌలింగ్:

ప్యాట్ కమ్మిన్స్ 4-0-29-0
ప్రసీద్ కృష్ణ 4-0-29-3
కమలేష్ నాగర్‌కోటి 3-0-40-0
వరుణ్ చక్రవర్తి 4-0-27-0
సునీల్ నరైన్ 4-0-28-2
నితీష్ రానా 1-0-7-0

Advertisement

Next Story