- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ సేన మరోసారి విఫలం
దిశ, స్పోర్ట్స్ : సిడ్నీలో జరిగిన రెండో టీ20లో కోహ్లీ సేన మరోసారి విఫలమయ్యింది. అదేంటి.. రెండో టీ20లో అద్భుత విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది కదా.. మరి విఫలం అంటారేమిటనేగా మీ అనుమానం. అయితే ఇక్కడ కోహ్లీ సేన విఫలమయ్యింది ఛేదనలో కాదు.. క్యాచ్‌లు పట్టుకోవడంలో. ఆరోన్ ఫించ్ గైర్హాజరీలో మాథ్యూవేడ్ ఈ రోజు కెప్టెన్సీ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన వేడ్ దూకుడుగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను కోహ్లీ వదిలేశాడు.
అయితే కోహ్లీ పట్టుకున్నాడని భావించి పిచ్ మధ్యలోనే ఆగిపోయిన వేడ్.. బంతి మిస్ అయిన విషయం గుర్తించలేదు. కోహ్లీ వెంటనే బంతిని కీపర్ రాహుల్‌కు విసరడంతో వేడ్ రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో కనుక వేడ్ ఔటవకపోతే ఆసీస్ భారీ స్కోరే సాధించేది. ఇక హార్దిక్ పాండ్యా కూడా ఒక సింపుల్ క్యాచ్‌ను బౌండరీ వద్ద వదిలేశాడు. ఈ రోజు భారత జట్టు పలు మిస్ ఫీల్డ్స్ చేయడం, క్యాచ్‌లు వదిలేయడంతోనే ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. ఈ లోపాలను టీమ్ ఇండియా సరిచేసుకోక పోతే భవిష్యత్ మ్యాచ్‌లలో చాలా నష్టపోవాల్సి వస్తుంది.